Geethu Royal Big Boss 6 : ఎలిమినేట్ అవ్వడంతో అలాంటి పని చేశా.. అమ్మకు తెలిస్తే చెప్పుతో కొడుతుంది: గీతూ రాయల్

తెలుగు బుల్లితెర పేక్షకులకు బిగ్ బాస్ కంటెస్టెంట్ గీతూ రాయల్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.

ఈమె ప్రస్తుతం తెలుగులో ప్రసారం అవుతున్న బిగ్ బాస్ సీజన్ 6 లోకి కంటెస్టెంట్ గా ఎంట్రీ ఇచ్చి ఊహించని విధంగా ఎలిమినేట్ బయటకు వచ్చిన విషయం తెలిసిందే.

ఎలా అయినా టైటిల్ గెలవాలని, బిగ్బాస్ షోనే తన ప్రపంచం అనుకొని లోపలికి ఎంట్రీ ఇచ్చిన గీతూ రాయల్ టాప్ ఫైవ్ లో కాదు కదా టాప్ 10 లో కూడా ఉండకుండా ఆ ఊహించని విధంగా చేసింది.అయితే బిగ్ బాస్ నుంచి ఎలిమినేట్ అయిన తర్వాత గీతూ డిప్రెషన్లోకి వెళ్లిపోయింది.

ఇటీవలే ఆమె టీవీలో ఫ్యామిలీ ఎపిసోడ్ ని చూస్తూ బోరని ఏడ్చేసిన విషయం తెలిసిందే.ఇది ఇలా ఉండి తాజాగా గీతూ బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత 20 రోజుల డిప్రెషన్ నుంచి బయటకు వచ్చి ఒక తుప్పాస్ పని చేశాను.

ఈ విషయం మా అమ్మకు తెలిస్తే చెప్పుతో కొడుతుంది అంటూ తాజాగా తన యూట్యూబ్ ఖాతాలో ఒక వీడియోని విడుదల చేసింది.వీడియోలో గీతూ రాయల్ మాట్లాడుతూ నేను బిగ్ బాస్ షోలో ఫ్యామిలీ ఎపిసోడ్ ని చూసి తెగ ఏడ్చేసాను.

Advertisement

ఎందుకంటే మా అమ్మ నా కోసం బిగ్ బాస్ హౌస్ లోకి వస్తుందని చీర కూడా కొని పెట్టాను.కానీ ఫ్యామిలీ ఎపిసోడ్ అయిన తర్వాత ఎలిమినేట్ అయ్యి ఉంటే బాగుండేది కానీ నేను ఊహించిన విధంగా ఎలిమినేట్ అయ్యాను.

నేను ఎలిమినేట్ అయిన రోజు బాగా ఏడ్చేసరికి నేను డిప్రెషన్ లోకి వెళ్ళాను అనుకున్నా నాగార్జున గారు నన్ను మళ్ళీ పిలిచి ఓదార్చారు అని చెప్పకు వచ్చింది గీతూ.ఇది ఇలా ఉంటే తాజాగా గీతూ తన కుడికాలి పై చిరుతచారల పచ్చబొట్టు వేయించుకుంది.టాటూ వేయించుకునేటప్పుడు ఆ నొప్పి తెలియకుండా ఉండటానికి బిగ్‌బాస్‌ చూస్తూ కూర్చుంది.

కాలిపై ఉన్న గాయం తాలూకు మచ్చను కప్పివేసేందుకే టాటూ వేయించుకున్నట్లు తెలిపింది గీతూ.ఈ విషయం గనుక మా అమ్మకు తెలిస్తే చెప్పు తో కొడుతుంది అంటూ ఫన్నీగా స్పందించింది.

చాలా ఏళ్ళ గ్యాప్ తీసుకొని రిపీట్ అయిన హీరో-హీరోయిన్ల కాంబినేషన్లు ఏంటో తెలుసా ?
Advertisement