Big Boss 6 : రేటింగ్ పడిపోయిందని ప్రైజ్ మనీ కట్ చేస్తున్నావా బిగ్ బాస్.. భలే ప్లాన్ వేసాడుగా?

తెలుగులో ప్రసారం అవుతున్న బిగ్ బాస్ షో అప్పుడే చూస్తుండగానే 10 వారాలను విజయవంతంగా పూర్తి చేసుకొని తాజాగా 11 వ వారం లోకి ఎంట్రీ ఇచ్చింది.

ఇక హౌస్ లో తాజాగా నామినేషన్స్ ప్రక్రియలో భాగంగా హౌస్ ఒక్కసారిగా మాటల యుద్దాలతో హీటెక్కిపోయింది.

ఇది ఇలా ఉంటే తాజాగా జరిగిన నామినేషన్స్‌ చెత్తగా ఉన్నాయంటూ బిగ్ బాస్ ప్రేమికులు పెద్ద ఎత్తున సోషల్‌ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు.తాజాగా హౌస్ మేట్స్ కోసం బిగ్ బాస్ నామినేషన్స్‌ నుంచి కాపాడుకునేందుకు హౌస్‌మేట్స్‌కు ఒక టాస్క్ ఇచ్చాడు.

ఒక చెక్‌ ఇచ్చి దాని మీద యునిక్‌గా అనిపించే అమౌంట్‌ రాయమన్నాడు.ఏ సభ్యులైతే చెక్‌ పై ఎక్కువ మనీ రాస్తారో వారు నామినేషన్‌ నుంచి సేవ్‌ అవుతారని చెప్పాడు.

ఆ మొత్తం డబ్బులను బిగ్‌బాస్‌ ప్రైజ్‌మనీ లో నుంచి తగ్గిస్తాము అంటూ ఒక భారీ ట్విస్ట్‌ ఇచ్చాడు.అలాగే చెక్‌పై ఎంత రాస్తున్నామన్నది ఎవరితో చర్చించడానికి వీల్లేదని బిగ్‌బాస్‌ చెప్పాడు.

Advertisement

కానీ ఈ నియమాన్ని శ్రీ సత్య ఉల్లంఘించడంతో ఆమెను ఈ పోటీ నుంచి డిస్ క్వాలిఫై చేసాడు బిగ్ బాస్.ఇకపోతే చెప్పినట్లు గా ఒక్కొక్క కంటెస్టెంట్ ఒక్కో అమౌంట్ రాసారు.

అయితే చివరికి అత్యధిక నంబర్‌ రాసినవారు కాకుండా రాజ్‌ను సేవ్‌ చేశాడు బిగ్‌బాస్‌.అంతేకాకుండా ప్రైజ్‌ మనీలో నుంచి రూ.5 లక్షలు కట్‌ అయ్యాయట.ఈ విషయం ఫై పలువురు స్పందిస్తూ రేటింగ్ తగ్గడంతో బిగ్ బాస్ ఇలా ప్లాన్ చేశాడా ప్లాన్ మాములుగా లేదుగా అంటూ పెద్ద ఎత్తున కామెంట్స్ చేస్తున్నారు.

ఇకపోతే ఈ వారం ఎలా అయినా శ్రీ సత్య ను ఎలిమినేట్ అయ్యేలా చేయాలి అనుకుంటున్నారు నెటిజన్స్.మరి నిజంగానే ఈ వారం శ్రీ సత్య ఎలిమినేట్ అవుతుందో లేదో చూడాలి మరి.

Bet365: Mejores Juegos Y Slots En Argentina (AR) — Análisis Comparativo
Advertisement