BigBoss 6 Arjun Kalyan : బిగ్ బాస్ అర్జున్ కళ్యాణ్ నిజంగానే బిజీ అయ్యాడా..!

బిగ్ బాస్ సీజన్ 6 లో కొద్దివారాలే ఉన్నా అందరికి పరిచయమైన నటుడు అర్జున్ కళ్యాణ్.

హౌస్ లో ఉన్నంతకాలం అతను శ్రీ సత్య మీద ఫోకస్ చేశాడు కానీ అదేదో ఆట మీద చేసి ఉంటే అతను ఇప్పటికీ హౌస్ లో ఉండే వాడు.

బిగ్ బాస్ కు వెళ్లడానికి ముందే అతను సినిమాల్లో నటిస్తూ వచ్చాడు.వెబ్ సీరీస్ లు కూడా చేశాడు.

ఎం.ఎస్ పూర్తి చేసినా సినిమాల మీద ఇంట్రెస్ట్ తో న్యూయార్క్ ఫిల్మ్ ఇన్ స్ట్యూట్ లో యాక్టింగ్ కోర్స్ చేసిన అర్జున్ కళ్యాణ్ సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు చేస్తూ వచ్చాడు.ప్రేమం, ప్లే బ్యాక్, వరుడు కావాలి లాంటి సినిమాల్లో సైడ్ రోల్స్ చేశాడు అర్జున్ కళ్యాణ్.

మిస్సమ్మ, నారి నారి నడుమ మురారి వెబ్ సీరీస్ లతో కూడా మెప్పించాడు అర్జున్ కళ్యాణ్.బిగ్ బాస్ కి వెళ్లొచ్చాక అతను సినిమాలతో బిజీ అయ్యాడు.

Advertisement

ప్రస్తుతం అర్జున్ కళ్యాణ్ మాటే మంత్రము, బాబు నెంబర్ 1, బుల్ షిట్ గయ్ సినిమాలు చేస్తున్నాడు.వీటితో పాటుగా ఒక వెబ్ సీరీస్ కూడా ఓకే చేసినట్టు టాక్.

మొత్తానికి బిగ్ బాస్ తో ఆశించినంత కాకపోయినా కెరీర్ పరంగా బిజీ అవుతున్నాడు అర్జున్ కళ్యాణ్.

Advertisement