బాక్స్‌లో ఛార్జర్స్‌ ఇవ్వనందుకు యాపిల్‌కి భారీ షాక్.. రూ.156 కోట్ల ఫైన్..

ప్రముఖ ప్రీమియం మొబైల్ ఫోన్ల తయారీదారు యాపిల్ సంస్థ తీసుకొనే కొన్ని నిర్ణయాలు చాలా మంది యూజర్లకు చిరాకు తెప్పిస్తాయి.ఆ నిర్ణయాలలో ఐఫోన్ల బాక్స్‌లో ఛార్జర్స్‌ తొలగించడం ఒక్కటని చెప్పవచ్చు.

అయితే ఛార్జింగ్ సాకెట్స్‌తో ఐఫోన్లను విక్రయించనందుకు బ్రెజిల్‌లోని ఒక కోర్టు యాపిల్‌కు దాదాపు 19 మిలియన్ డాలర్ల (సుమారు రూ.156 కోట్లు) జరిమానా విధించింది.అంతేకాదు బ్రెజిల్ దేశంలో ఐఫోన్లతో పాటు ఛార్జర్‌లను తప్పనిసరిగా అందించాలని ఆదేశించింది.

కాగా తాజాగా బ్రెజిల్ కోర్టు ఇచ్చిన తీర్పుపై అప్పీల్ చేస్తామని యాపిల్ తెలిపింది.ఫోన్ కొనుగోళ్లలో ఛార్జర్‌లను చేర్చకపోవడాన్ని న్యాయమూర్తి దుర్వినియోగ అభ్యాసంగా అభివర్ణించారు.దీనివల్ల కొనుగోలుదారులు అదనంగా ఛార్జర్ల కోసం డబ్బులు చెల్లించుకోవాల్సిన పరిస్థితి వచ్చిందని ఆ న్యాయమూర్తి అసహనం వ్యక్తం చేశారు.2020లో యాపిల్ కంపెనీ పర్యావరణ సమస్యలను పేర్కొంటూ ఐఫోన్ 12తో తన ఐఫోన్లతో పవర్ అడాప్టర్‌లను అందించడం ఆపివేసింది.కంపెనీ ఇప్పుడు కొత్త ఐఫోన్లతో ఛార్జింగ్ కేబుల్‌ను మాత్రమే అందిస్తోంది.

యాపిల్ ప్రకారం, ఐఫోన్‌లతో ఛార్జర్లను అందించకపోతే 861,000 టన్నుల రాగి, జింక్, టిన్ ఆదా అవుతుంది.USB-C సపోర్ట్‌ను అన్ని యాపిల్ ప్రొడక్ట్స్‌లో అందించడం ద్వారా పర్యావరణానికి మంచి జరుగుతుందని బ్రెజిల్ న్యాయ మంత్రిత్వ శాఖ యాపిల్‌కి తెలిపింది.

అలాగని యూజర్లపై అధిక భారం మోపకూడదని, ఛార్జర్లను కొనుగోలు చేసేలా బలవంత పెట్టకూడదని అభిప్రాయపడింది.కోర్టు నిర్ణయం పట్ల చాలామంది హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Advertisement

"బలవంతపు కొనుగోళ్ల నుండి వినియోగదారులను రక్షించడానికి ప్రతి దేశం బ్రెజిల్ లాగా ఉండాలి! అసలు కొత్త ఐఫోన్‌లతో ఉచిత ఇయర్‌ఫోన్‌లను చేర్చమని బ్రెజిల్ కోర్టు యాపిల్‌ను ఎందుకు బలవంతం చేయడం లేదు? మనం మొబైల్ బాక్స్‌ని కొనుగోలు చేసినప్పుడు ఛార్జర్ పొందాల్సిన హక్కు కూడా ఉంటుంది" అని నెటిజన్లు కామెంట్స్‌ చేస్తున్నారు.

వైరల్ వీడియో : పాఠాలు వింటూనే గుండెపోటుకు గురైన చిన్నారి.. చివరకి?
Advertisement

తాజా వార్తలు