టీడీపీ వైపు చూస్తున్న బిగ్ బాస్ విన్నర్ కౌశల్!

బిగ్ బాస్ రియాలిటీ షో ద్వారా ఒక్కసారిగా ఫేంలోకి వచ్చిన నటుడు కౌశల్.

కౌశల్ ఆర్మీ పేరుతో అధిక సంఖ్యలో ప్రజలు బిగ్ బాస్ లో కౌశల్ కి సపోర్ట్ గా ఓటింగ్ చేసి అతనిని గెలిపించడం జరిగింది.

తరువాత కూడా కౌశల్ ఆర్మీ పేరుతో అతను అసోషియేషన్ ఏర్పాటు చేసి సోషల్ సర్వీస్ యాక్టివిటీస్ మొదలెట్టాడు.అయితే ఊహించని విధంగా కౌశల్ కి, కౌశల్ ఆర్మీలో కొంత మంది నుంచి వ్యతిరేకత మొదలైంది.

దానిని కాస్తా మీడియా చానల్స్ మరో సారి ఉపయోగించుకొని రచ్చ చేసాయి.ఇదిలా వుంటే చాలా రోజులుగా కౌశల్ రాజకీయాలపై ఆసక్తి చూపిస్తున్నాడు.

ఇప్పుడు ఊహించని విధంగా టీడీపీ అధినేత చంద్రబాబుని కలిసి ఆ పార్టీలో చేరడానికి ఆసక్తి చూపించాడు.అలాగే రానున్న ఎన్నికలలో టీడీపీ తరుపున ప్రచారం చేస్తా అని మాట ఇచ్చాడు.

Advertisement

ఇతను మంత్రి గంటా శ్రీనివాసరావుతో వున్న సన్నిహిత సంబంధాలు ఉపయోగించుకొని టీడీపీలో చేరబోతున్నట్లు తెలుస్తుంది.మరి కౌశల్ చేరిక టీడీపీకి ఎంత వరకు లాభిస్తుంది అనేది చూడాలి.

జుట్టు మెరుస్తూ కాంతివంతంగా మారాలంటే...అద్భుతమైన ప్యాక్స్
Advertisement

తాజా వార్తలు