H1B Visa : హెచ్‌1బీ వీసా ప్రక్రియను మెరుగుపరిచేందుకు బిడెన్ కృషి చేస్తున్నారు : వైట్‌హౌస్

హెచ్ 1 బీ వీసా( H1B Visa ) ప్రక్రియ, గ్రీన్ కార్డ్ బ్యాక్‌లాగ్ సహా దేశంలోని చట్టబద్ధమైన ఇమ్మిగ్రేషన్ వ్యవస్థకు సంబంధించిన సమస్యలను పరిష్కరించడానికి అమెరికా అధ్యక్షుడు జో బైడెన్( US President Joe Biden ) తాను చేయగలిగినదంతా చేస్తున్నారని వైట్‌హౌస్ పేర్కొంది.

ఈ మేరకు వైట్‌హౌస్ ప్రెస్ సెక్రటరీ కరీన్ జీన్ పియరీ( Karine Jean-Pierre ) బుధవారం విలేకరులకు తెలిపారు .

చట్టబద్ధమైన వలసదారుల కష్టాలను పరిష్కరించడంలో అధ్యక్షుడు చేస్తున్నంత ప్రయత్నం .అక్రమ వలసదారుల కోసం చేయడం లేదని భారతీయ అమెరికన్లలోని ఒక వర్గంలో వున్న భావన గురించిన ప్రశ్నలకు సైతం ఆమె సమాధానమిచ్చారు.బైడెన్ గురువారం టెక్సాస్‌లోని మెక్సికో దక్షిణ సరిహద్దుకు వెళ్లనున్నారు.

ఇమ్మిగ్రేషన్ వ్యవస్ధ( Immigration System ) సమగ్రతను బలోపేతం చేయడానికి , మోసాన్ని తగ్గించడానికి మా ప్రయత్నాలలో భాగంగా డీహెచ్ఎస్ .హెచ్1బీ వీసాకు సంబంధించిన తుది నియమాన్ని ప్రచురించిందని జీన్ పియర్ చెప్పారు.అందుచేత మార్పులు సరసమైన, సమానమైన ఫలితాలను ప్రోత్సహిస్తాయి.

వీసా ప్రక్రియను మెరుగుపరచడానికి చేయగలిగినదంతా చేస్తూనే వుంటామని పియరి పేర్కొన్నారు.యూఎస్ పౌరసత్వ, ఇమ్మిగ్రేషన్ సర్వీసుల విభాగం (యూఎస్‌సీఐఎస్) సంస్థాగత ఖాతాలను ప్రారంభించినట్లు ప్రకటించింది.

Advertisement

ఇది ఒక సంస్థలోని బహుళ వ్యక్తులతో పాటు చట్టబద్ధమైన ప్రతినిధులను హెచ్ 1 బీ రిజిస్ట్రేషన్‌లు, హెచ్‌ 1 బీ పిటిషన్‌లు , ఏదైనా అనుబంధిత ఫాం ఐపై సహకరించడానికి అనుమతిస్తుంది.మార్చి 2024లో ప్రారంభమయ్యే హెచ్ 1 బీ ఎలక్ట్రానిక్ రిజిస్ట్రేషన్( H1B Electronic Registration ) ప్రక్రియలో పాల్గొనడానికి కొత్త సంస్థాగత ఖాతా అవసరమని యూఎస్‌సీఐఎస్( USCIS ) తెలిపింది.

విదేశాలకు చెందిన నిపుణులైన వారిని అమెరికా సంయుక్త రాష్ట్రాల్లో ఉద్యోగం చేసుకునేందుకు వీలు కల్పించే హెచ్ 1 బీ వీసా హాట్ కేక్ వంటిదన్న సంగతి తెలిసిందే.ఏటా హెచ్‌-1బీ వీసాల కోసం లక్షల సంఖ్యలో దరఖాస్తులు వస్తుంటాయి.వీటిలో కంప్యూటర్‌ ఆధారిత లాటరీ పద్ధతి ద్వారా 65వేల దరఖాస్తులను ఎంపిక చేసి అమెరికా వీసా జారీ చేస్తుంది.

వీటితో పాటు సైన్స్‌, టెక్నాలజీ, ఇంజినీరింగ్‌, మ్యాథమెటిక్స్‌( STEM ) విభాగాల్లో అమెరికా యూనివర్శిటీల్లో ఉన్నత విద్య పూర్తి చేసిన విదేశీ విద్యార్థులకు మరో 20వేల వీసాలు ఇస్తారు.అంటే మొత్తం 85 వేల హెచ్ 1 బీ వీసాలన్న మాట.

ఉల్లి తొక్కలతో ఊడిపోయే జుట్టుకు ఎలా చెక్ పెట్టవచ్చో తెలుసా?
Advertisement

తాజా వార్తలు