సిట్ కార్యాలయంలో దాదాపు మూడు గంటల నుండి అధికారులు చంద్రబాబుని( Chandrababu Naidu ) విచారణ చేస్తూ ఉన్నారు.
మధ్యలో బ్రేక్ ఇవ్వటంతో ఆ సమయంలో చంద్రబాబు సతీమణి భువనేశ్వరీని,( Bhuvaneshwari ) లోకేష్,( Nara Lokesh ) బ్రాహ్మణినీ కలవడం జరిగింది.
కుటుంబ సభ్యులు చంద్రబాబుని పరామర్శించారు.విచారణ బ్రేక్ మధ్యలో కుటుంబ సభ్యులను కలిసేందుకు సీఐడీ అధికారులు అనుమతులు ఇవ్వడం జరిగింది.
దాదాపు మూడు గంటలపాటు విచారణ జరిగింది.అందుతున్న సమాచారం ప్రకారం ఈరోజు రాత్రంతా విచారించి రేపు ఉదయం 5 గంటల ప్రాంతంలో చంద్రబాబుని కోర్టు ఎదుట హాజరు పరిచే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి.అరెస్టు చేసిన అనంతరం 24 గంటలలో కోర్టులో హాజరు పరచాలనే నిబంధన ఉండటంతో.
ఈ ఉదయం 6 గంటలకు అరెస్టు చేయటంతో రేపు ఉదయం 6 గంటలలోపు న్యాయమూర్తి ఎదుట ప్రవేశపెట్టనున్నట్లు సమాచారం.
మరోపక్క చంద్రబాబు తరుపు వాదించడానికి ఢిల్లీ నుండి లాయర్ సిద్ధార్థ లూథ్రా( Sidharth Luthra ) సిట్ కార్యాలయానికి చేరుకోవడం జరిగింది.చంద్రబాబుని సిద్ధార్థ లూథ్రా కలిసే అవకాశం ఉన్నట్లు సమాచారం.కాగా సిట్ కార్యాలయం ప్రాంగణంలోనే బాలకృష్ణ( Balakrishna ) కూడా ఉన్నారు.
చంద్రబాబుని సీఐడీ అధికారులు విచారణకు కార్యాలయానికి తీసుకెళ్ళిన సమయంలోనే బాలకృష్ణ, బ్రాహ్మణి. హైదరాబాద్ నుండి విమానం ద్వారా విజయవాడకు చేరుకోవడం జరిగింది.
తాజా వార్తలు
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy