భూమన కరుణాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

అమరావతి రాజధాని కావాలని జగన్ ఎప్పుడూ చెప్పలేదని.అమరావతిని సమర్థించలేదని తిరుపతి వైసీపీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి అన్నారు.

అమరావతిని జగన్ ఆనాడు సమర్థించలేదా? అని చంద్రబాబు అంటున్నారని.జగన్ అమరావతిని నూటికి నూరు శాతం సమర్థించలేదని చెప్పారు.

Bhumana Karunakar Reddy's Sensational Comments-భూమన కరుణాక�

అమరావతి శంకుస్థాపనకు జగన్ కు ఆహ్వానం వస్తే.ఆయన వెళ్లనని చెప్పారని అన్నారు.

ఈ విషయాన్ని ప్రజలు ఎన్నడూ మర్చిపోరని చెప్పారు.రాజధాని విషయంలో శివరామకృష్ణన్ కమిటీ చెప్పిన విషయాలకు కట్టుబడి ఉంటానని శాసనసభలో జగన్ చెప్పారని అన్నారు.

Advertisement

ప్రభుత్వ భూమిలో రాజధానిని కట్టడం సరైనదని జగన్ చెప్పారని.రియలెస్టేట్ వ్యాపారానికి, ల్యాండ్ పూలింగ్ కు తాము వ్యతిరేకమని జగన్ శాసనసభ సాక్షిగా చెప్పారని తెలిపారు.

అప్పట్లో ప్రతిపక్షంలో ఉన్న తాము ల్యాండ్ పూలింగ్ ద్వారా చంద్రబాబు చేస్తున్న అన్యాయాన్ని పలు సందర్భాల్లో చెప్పామని అన్నారు.రాయలసీమకు ద్రోహం చేయడానికి చంద్రబాబు కంకణం కట్టుకున్నారని చెప్పారు.

మూడు రాజధానులను అన్ని ప్రాంతాల ప్రజలు స్వాగతిస్తున్నారని.రాజధాని వికేంద్రీకరణతోనే అన్ని ప్రాంతాల అభివృద్ధి సాధ్యమని అన్నారు.

పురుషుల్లో అధిక హెయిర్ ఫాల్ కు చెక్ పెట్టే ఎఫెక్టివ్ రెమెడీ ఇదే!
Advertisement

తాజా వార్తలు