పవన్ ను ఎవరికైనా చూపించండయ్యా అంటున్న భీమవరం ఎమ్మెల్యే 

గత కొద్ది రోజులుగా సభలు ,సమావేశాలతో ఏపీ రాజకీయాలను హీట్ ఎక్కిస్తున్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్( Pawan Kalyan ), రాష్ట్రవ్యాప్తంగా తన పర్యటన ను కొనసాగించేందుకు ప్రయత్నిస్తున్నారు.

పూర్తిగా వైసిపిని( YCP ) టార్గెట్ చేసుకుంటూ పవన్ అనేక విమర్శలు చేస్తున్నారు.

అలాగే స్థానిక అంశాలను ప్రస్తావిస్తూ వైసిపి సిట్టింగ్ ఎమ్మెల్యేల పైనా విమర్శలతో విరుచుకుపడుతున్నారు.అభివృద్ధి , మౌలిక సదుపాయాల కల్పనలో ఏపీ ప్రభుత్వం విఫలమై ందని పదే పదే పవన్ విమర్శిస్తున్నారు.

జగన్ ను ఇంటికి పంపేందుకే తాను టిడిపి, బిజెపితో పొత్తు పెట్టుకున్నాను అంటూ సమర్ధించుకునే ప్రయత్నం చేస్తున్నారు.ఈ విమర్శలకు తాజాగా భీమవరం వైసీపీ ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ స్పందించారు.2019 ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ పై భీమవరం( Bhimavaram ) నుంచి వైసీపీ తరపున పోటీ చేసిన గ్రంధి శ్రీనివాస్ ( Granthi Srinivas )గెలుపొందారు.

ఇటీవల కాలంలో పవన్ భీమవరం పర్యటనలో తరచుగా తనను టార్గెట్ చేసుకుని విమర్శలు చేస్తుండడం పై కాజాగా స్పందించిన శ్రీనివాస్ పవన్ పై సంచలన విమర్శలు చేశారు.పవన్ ఆకు రౌడీలా మాట్లాడుతున్నారని,  ఆయనకు పిచ్చి బాగా ముదిరిందని , ఆయనను ఆస్పత్రుల్లో ఎవరికైనా చూపించాలంటూ గ్రంధి శ్రీనివాస్ సూచించారు .పవన్ కు పిచ్చి బాగా ముదిరిందని , ఇతర పార్టీలకు చెందిన నేతలపై ఆయన వాడుతున్న భాష అభ్యంతరకరంగా ఉంది అని గంది శ్రీనివాస విమర్శించారు.ఇది పిచ్చికి సంబంధించిన లక్షణం అని శ్రీనివాస్ అన్నారు.

Advertisement

పవన్ ఊసరవెల్లిలా మాట్లాడుతున్నాడని,  ఎప్పుడు ఏం మాట్లాడతాడో ఆయనకే తెలియదని , గతంలో తనను దూషించిన వ్యక్తికే పవన్ ఈసారి టిక్కెట్ ఇచ్చారని శ్రీనివాస్ గుర్తు చేశారు.

చిరంజీవి కూడా ప్రజారాజ్యం పార్టీని( Praja Rajyam Party ) పెట్టి తర్వాత కాంగ్రెస్ లో విలీనం చేశారని,  పవన్ కూడా పార్టీని టిడిపిలో విలీనం చేయాలని శ్రీనివాస్ కోరారు.  ఈ సందర్భంగా చిరంజీవి పైన గ్రంధి శ్రీనివాస్ విమర్శలు చేశారు.చిరంజీవి పక్కా కమర్షియల్ అని , ఇప్పుడు తన సినిమా ప్రమోషన్ కోసం పవన్ కళ్యాణ్ కు మద్దతు ఇస్తున్నారని అనుమానం వ్యక్తం చేశారు.

Advertisement

తాజా వార్తలు