చిరంజీవితో రొమాన్స్ ఎంజాయ్ చేసేదాన్ని కాదు.. వైరల్ అవుతున్న భానుప్రియ ఆసక్తికర వ్యాఖ్యలు!

టాలీవుడ్ ఇండస్ట్రీలో చిరంజీవి,( Chiranjeevi ) భానుప్రియ( Bhanupriya ) కాంబినేషన్ క్రేజీ కాంబినేషన్ అనే సంగతి తెలిసిందే.

ఈ కాంబినేషన్ కు హిట్ కాంబినేషన్ గా కూడా ఇండస్ట్రీలో గుర్తింపు ఉంది.

చెప్పుకోదగ్గ స్థాయిలో సినిమాలలో వీళ్లిద్దరూ కలిసి నటించడం జరిగింది.ఒక ఇంటర్వ్యూలో భానుప్రియ మాట్లాడుతూ షాకింగ్ విషయాలను చెప్పుకొచ్చారు.

భానుప్రియ చెప్పిన ఆ విషయాలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.నేను చిరంజీవి కాంపిటీటర్ అని భావించేదానినని ఆమె తెలిపారు.

చిరంజీవి కాళ్లు కదిపే విధానాన్ని డాన్స్ మూమెంట్స్ ను నేను గమనించేదానినని భానుప్రియ వెల్లడించారు.చిరంజీవినే గమనిస్తూ ఉండటం వల్ల ఆయనతో రొమాన్స్ చేసినా నేను మాత్రం ఎంజాయ్ చేసేదాన్ని కాదని భానుప్రియ పేర్కొన్నారు.

Advertisement

చిరంజీవి కూడా నాకు ఇదే విషయం చెప్పేవారని భానుప్రియ వెల్లడించారు.

భానుప్రియ చెప్పిన విషయాలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.చిరంజీవి డాన్సింగ్ స్కిల్స్ కు ఎంతోమంది ఫ్యాన్స్ ఉన్నారు.చిరంజీవి డాన్స్ ను( Chiranjeevi Dance ) ఈతరం ప్రేక్షకులు సైతం ఎంతగానో ఇష్టపడతారనే సంగతి తెలిసిందే.

చిరంజీవి ప్రస్తుతం విశ్వంభర( Vishwambhara ) సినిమాపైనే ఫుల్ ఫోకస్ పెట్టారు.ఈ సినిమా భారీ బ్లాక్ బస్టర్ హిట్ ను అందిస్తుందని అభిమానులు ఫీలవుతున్నారు.

యంగ్ జనరేషన్ ప్రేక్షకులకు సైతం నచ్చేలా ఉండే కాన్సెప్ట్ లను చిరంజీవి ఎంచుకుంటున్నారు.చిరంజీవి పారితోషికం సైతం భారీ రేంజ్ లో ఉంది.సీనియర్ హీరోలలో 200 కోట్ల రూపాయల రేంజ్ లో పారితోషికం అందుకునే హీరోగా చిరంజీవి గుర్తింపును సొంతం చేసుకున్నారు.

తెలుగు రాశి ఫలాలు, పంచాంగం - జూన్ 5, ఆదివారం, జ్యేష్ఠ మాసం , 2022

విశ్వంభర సినిమాలో ఫ్యాన్స్ కు నచ్చే డ్యాన్స్ మూమెంట్స్ ఎక్కువగానే ఉన్నాయని తెలుస్తోంది.భానుప్రియ ప్రస్తుతం సినిమాలకు సైతం దూరంగా ఉన్నారనే సంగతి తెలిసిందే.మంచి పాత్రలను ఆఫర్ చేస్తే ఆమె రీఎంట్రీ ఇచ్చే అవకాశాలు అయితే ఉంటాయి.

Advertisement

తాజా వార్తలు