Bhanumathi: ఒక్కో బూతు స్థానంలో ఒక్కో సామెత..భానుమతి చమత్కారం చూడండి

భానుమతి.( Bhanumathi ) అగ్ర కథానాయకగా, దర్శకురాలిగా, నిర్మాతగా అన్నిటికి మించి మంచి గాయకురాలిగా ఆమెకు తిరుగులేని పేరు ఉంది.

అన్నిటికీ మించి ఆమె కొడుకు పేరుతో భరణి స్టూడియోస్( Bharani Studios ) అని నిర్మించి అందులో మంచి విలువలతో కూడిన కొన్ని సినిమాలను కూడా తీశారు.తెలుగుతో పాటు సౌత్ ఇండియాలో ఆమె అన్ని భాషల్లోనూ నటించారు.

ఆమె సినిమాలో నటించాలి అంటే ఖచ్చితంగా ఆ చిత్రం ఒక్క పాటైనా కూడా ఉండాలని పట్టుబట్టేవారు.వాయిస్ పెరుగుతున్న కొద్ది ఆమె అవకాశాలు కూడా తగ్గుతూ వచ్చాయి ఇక హీరోయిన్ పాత్ర నుంచి కాస్త వయిసు పెరిగే సరికి బామ్మ పాత్రలు చేయాల్సి వచ్చింది.

ఇక భానుమతి మంగమ్మ గారి మనవడు సినిమాలో మంగమ్మ అనే టైటిల్ పాత్రలో నటించి వయసు పెరిగిన ఆమెలో సత్తా ఇంకా తగ్గలేదని నిరూపించుకున్నారు.

Advertisement

మంగమ్మగారి మనవడు( Mangamma Gari Manavadu ) సినిమా కోసం కోడి రామకృష్ణ మొదట జమునను తీసుకోవాలనుకున్నారు.అయితే ఆమెకి ఇంకా అంత వయసు రాలేదని బామ్మ పాత్రలు చేయడానికి సిద్ధంగా లేనని చెప్పడంతో ఆ పాత్ర కోసం భానుమతి గారిని సంప్రదించారు.ఆమె సినిమా కథ విన్న తర్వాత ఒప్పుకున్నారు అయితే అదే టైంలో ఇండస్ట్రీ కాస్త మాస్ చిత్రాలు, బూతు లేదా ద్వందార్థం వచ్చే సినిమాలు ఎక్కువగా తీస్తూ హిట్స్ కొడుతున్న సందర్భం అది.ఆయన పవర్ఫుల్ పాత్ర అయినా మంగమ్మ కూడా కొన్ని బూతులు మాట్లాడితే అలాగే డబల్ మీనింగ్ డైలాగులు మాట్లాడితే సినిమా హిట్ అవుతుంది అని భావించారు.కానీ భానుమతి గారితో ఆ విషయం చెప్పడానికి భయపడ్డారు దాంతో మొదట డైలాగ్ వర్షన్ అయితే రాసి ఆమె కు పంపించారు.

ఆ స్క్రిప్ట్ చూసిన తర్వాత భానుమతి ఆగ్రహానికి గురయ్యారట ఇలాంటి సినిమా మీరు తీయాలనుకుంటున్నారా ఇలా అయితే నేను నటించను అని పేచి పెట్టారట.దాంతో తనకు నచ్చిన డైలాగులు ఆమని రాసుకోమని డైరెక్టర్ పూర్తి స్వేచ్ఛను ఇచ్చారట.భానుమతి గారికి అది వినియోగించుకున్న భానుమతి గారు ఆమెకు సంబంధించిన అన్ని డైలాగులు తీసేసి వాటి స్థానంలో సామెతలు పెట్టి ఇచ్చారట.

అదే సామెతలతో సినిమాను కూడా పూర్తి చేశారు.కోడి రామకృష్ణ అవన్నీ కూడా సినిమాలో బాగా వర్కౌట్ కావడంతో అది పెద్ద విజయం సాధించింది అంటూ బ్రతికున్న సమయంలో కోడి రామకృష్ణ ఒక ఇంటర్వ్యూలో తెలిపారు.

Covid Declining Covid Cases In India Health Covid India Corona COVIDCases CovidIn
Advertisement

తాజా వార్తలు