తస్మాత్ జాగ్రత్త.. ఈ కొత్త రకం దొంగతనం గురించి తెలుసుకోకపోతే లక్షల్లో నష్టం..?

ఈ రోజుల్లో దొంగతనాలు బాగా ఎక్కువైపోయాయి.దొంగలు పట్టపగలే పబ్లిక్ ప్లేసుల్లోనే ధైర్యంగా చోరీలకు పాల్పడుతున్నారు.

వెహికల్స్ లో కనిపించిన విలువైన వస్తువులు కూడా దోచేస్తున్నారు.ముఖ్యంగా కారు లోపల ఏదైనా విలువైన వస్తువు కనిపించింది అంటే చాలు దాన్ని ఎలాగైనా పట్టుకెళ్ళిపోతున్నారు.

తాజాగా బెంగళూరులోని ఇందిరానగర్‌( Indira Nagar, Bangalore ) ప్రాంతంలో ఇలాంటి దొంగతనమే జరిగింది.కొంతమంది దొంగలు రోడ్డు పక్కన నిలిపి ఉన్న కార్ల కిటికీలను ఒక ప్రత్యేకమైన పరికరంతో పగలగొట్టి ల్యాప్‌టాప్‌లు, ఇతర విలువైన వస్తువులను దొంగతనం చేశారు.

ఈ దొంగతనం పట్టపగలు అందరూ చూస్తుండగానే జరిగింది, అక్కడే చాలామంది ఉన్నా, దొంగలు తప్పించుకున్నారు.ఈ దొంగలలో ఒకరు సెక్యూరిటీ గార్డ్ ( Security guard )దృష్టిని మరొకవైపు మళ్లించగా, మరొకరు కార్ల కిటికీలను పగలగొట్టి వస్తువులను చోరీ చేశారు.

Advertisement

ఈ దొంగతనం గురించి బాధితులలో ఒకరైన సూర్య అనే వ్యక్తి సోషల్ మీడియాలో పోస్ట్ చేసి, ఇతర వాహనదారులు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు.అలాగే, పోలీసులు త్వరగా స్పందించాలని కోరారు.

ఇందిరానగర్‌లోని గ్లోబల్ దేశి స్టోర్‌కు ( Global Desi Store )సమీపంలో ఉన్న 100 అడుగుల రోడ్డుపై నిలిపి ఉన్న నాలుగు కార్ల కిటికీలు దొంగలు పగలగొట్టారు.దొంగలు కార్ల నుంచి మూడు బ్యాగ్‌లను దొంగతనం చేశారు.

ఈ బ్యాగ్‌లలో ల్యాప్‌టాప్‌లు, ఇతర విలువైన వస్తువులు ఉన్నాయి.

ఈ థెఫ్ట్ మొత్తం CCTV కెమెరాల్లో రికార్డు అయింది.ఒక దొంగ ఒక ప్రత్యేకమైన పరికరాన్ని ఉపయోగించి కార్ల కిటికీలను చాలా సైలెంట్ గా పగలగొట్టాడు.మరొక దొంగ కాపలాదారుని దృష్టిని మరొకవైపు మళ్లించాడు.

ఉదయాన్నే నీళ్లలో తేనెను కలుపుకొని తాగుతున్నారా? అయితే ఈ జాగ్రత్తలు తప్పనిసరి..

ఇద్దరూ కలిసి బ్యాగ్‌లను తీసుకుని పారిపోయారు.బాధితుడు సూర్య తన అనుభవాన్ని X (ట్విట్టర్) వేదికగా పంచుకున్నారు.

Advertisement

ఇదే ప్రాంతంలో ఇంతకుముందు కూడా ఇలాంటి దొంగతనాలు జరిగాయి.ఈ దొంగలను పట్టుకోవాలని బెంగళూరు పోలీసులను కోరాడు బాధితుడు.

"అందరూ జాగ్రత్తగా ఉండండి! మీ కార్లలో విలువైన వస్తువులు కనిపించేలా వదిలివేయకండి.దయచేసి ఈ పోస్ట్‌ను మరింత మందికి చేరవేయండి.బెంగళూరు వాసులు సురక్షితంగా ఉండండి!" అని సూర్య తన పోస్ట్‌ను ముగించారు.

ఆగస్టు 28 నుంచి ఈ పోస్ట్‌ను ఏడు లక్షల మందికి పైగా చూశారు.ఇంకా ఈ సంఖ్య పెరుగుతూనే ఉంది.

చాలా మంది ఈ పోస్ట్‌ కింద కామెంట్లు చేస్తూ తమ అభిప్రాయాలను తెలియజేశారు.బెంగళూరు నగరం కాలం రోజు రోజుకు అత్యంత అన్‌ సేఫ్ సిటీగా మారుతోంది.

ఎక్కడా ఏ విలువైన వస్తువును కూడా వదిలేయవద్దు అని ఈ వీడియో చూసిన వాళ్ళు కామెంట్లు చేశారు.

తాజా వార్తలు