వచ్చే మూడు నెలలు జాగ్రత్త.. పండగల నేపథ్యంలో కేంద్రం హెచ్చరిక

వచ్చే మూడు నెలలు జాగ్రత్త.పాజిటివ్ రేటు 10శాతం కన్నా ఎక్కువ.

కేంద్రం హెచ్చరికరాబోయే రెండు మూడు నెలల్లో ప్రజలంతా జాగ్రత్తగా ఉండాలని కరోనా వ్యాప్తి చెందకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని పండగల నేపథ్యంలో కేంద్రం హెచ్చరికలు జారీ చేసింది. ఫ్లూ కేసులు పెరిగే కాలం కనుక ప్రతి ఒక్కరు జాగ్రత్తలు పాటించాలని నీతిఅయోగ్ సభ్యుడు (ఆరోగ్యం) వీకే పాల్ కోరారు.

దేశములో కరోనా పరిస్థితి పై కేంద్ర ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులు మీడియాతో మాట్లాడారు.ఇప్పటివరకు కరోనా కట్టడితో సాధించిన ఫలితాలను మరింత మెరుగు పరుచుకుందామన్నారు.దేశ యువతలో 20 శాతం మందికి రెండు రోజులు పంపిణీ పూర్తయిందని.62 శాతం మందికి కనీసం ఒక డోసు అందినట్లు చెప్పారు.దేశవ్యాప్తంగా కరోనా వైరస్ పరిస్థితి ప్రస్తుతం స్థిరంగా ఉందని కేరళలో కూడా కేసులు తగ్గుదల కనబడుతుంది కేంద్రం వెల్లడించింది.

దేశంలో 34 జిల్లాల్లో వీక్లీ పాజిటివ్ రేటు 10 శాతం కన్నా అధికంగా ఉండగా 32 జిల్లాలో 5 నుంచి 10 శాతంగా ఉంది.

Beware For The Next Three Months Centre Warns Against Backdrop Of Festivals
Advertisement
Beware For The Next Three Months Centre Warns Against Backdrop Of Festivals-వ�

వారంలో దేశవ్యాప్తంగా నమోదైన మొత్తం కేసుల్లో దాదాపు 67.79% కేరళలోనే వచ్చాయని ప్రస్తుతం అక్కడ 1.99 లక్షల క్రీయశీల కేసులు ఉన్నాయని కేంద్రం తెలిపింది.మిజోరాం, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్ర లో 10 వేల కన్నా ఎక్కువగా క్రియాశీల కేసులు ఉన్నట్లు కేంద్ర ఆరోగ్య కార్యదర్శి రాజేష్ భూషణ్ తెలిపారు.

మిజోరంలో పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నప్పటికీ వాక్సినేషన్ వేగంగా జరిగి తగిన చర్యలు తీసుకోవడం ద్వారా మెరుగుపడుతుందని భావిస్తున్నామన్నారు.పండగలు సీజన్  వస్తుండటంతో వ్యాక్సిన్ తీసుకోవడం, కరోనా నిబంధనలు పాటించడం, అనవసర ప్రయాణాలు తగ్గించుకోవడం చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని ఐసీఎంఆర్ డాక్టర్ బలరాం భార్గవ అన్నారు.

కేరళలో ఇన్ఫెక్షన్లు తగ్గుముఖం పడుతున్నాయని ఇతర రాష్ట్రాల్లో అదే పరిస్థితి కొనసాగుతుందని చెప్పారు.పండగల సీజన్ లో తగు జాగ్రత్తలు తీసుకోకపోతే మాత్రం కరోనా కేసులు ఆకస్మాత్తుగా పెరిగే ప్రమాదం ఉందని హెచ్చరించారు.

వినాయకుడి శరీరం ఇన్నింటికి సంకేతమా?
Advertisement

తాజా వార్తలు