విటమిన్ ఈ ఆయిల్( Vitamin E oil ) గురించి అందరికీ తెలిసిందే.చర్మ సౌందర్యానికి, జుట్టు సంరక్షణకు విటమిన్ ఈ ఆయిల్ అద్భుతంగా తోడ్పడుతుంది.
ముఖ్యంగా జుట్టు ఆరోగ్యానికి విటమిన్ ఈ ఆయిల్ ఒక వరం అని చెప్పుకోవచ్చు.అయితే ఈ ఆయిల్ ను ఎలా వాడాలి అన్నది చాలా మందికి అవగాహన ఉండదు.
విటమిన్ ఈ అనేది ఒక పవర్ ఫుల్ యాంటీ ఆక్సిడెంట్.విటమిన్ ఈ బ్లడ్ సర్క్యులేషన్ ను మెరుగుపరుస్తుంది.
హెయిర్ గ్రోత్ ను ఇంప్రూవ్ చేస్తుంది.అదే సమయంలో మరెన్నో ప్రయోజనాలను అందిస్తుంది.
మరి ఇంతకీ విటమిన్ ఈ ఆయిల్ ( Vitamin E oil )ను ఎలా వాడాలి అన్నది ఇప్పుడు తెలుసుకుందాం.
విటమిన్ ఈ ఆయిల్ ను నేరుగా తలకు అప్లై చేసుకోవచ్చు.ఆయిల్ ను తీసుకుని స్కాల్ప్ కు పట్టించి బాగా మసాజ్ చేసుకోవాలి.అరగంట అనంతరం తలస్నానం చేయాలి.
తద్వారా జుట్టు కుదుళ్లు బలోపేతం అవుతాయి.జుట్టు ఎదుగుదలను విటమిన్ ఈ ఆయిల్ ప్రోత్సహిస్తుంది.
హెయిర్ ఫాల్ సమస్యకు( hair fall problem ) చెక్ పెడుతుంది.జుట్టు ఆరోగ్యాన్ని పెంచుతుంది.
అలాగే చాలా మంది డ్రై హెయిర్( Dry hair ) సమస్యతో బాధపడుతుంటారు.అలాంటి వారు నాలుగు టేబుల్ స్పూన్ల పెరుగులో వన్ టేబుల్ స్పూన్ విటమిన్ ఈ ఆయిల్ వేసి బాగా మిక్స్ చేసుకోవాలి.
ఇప్పుడు ఈ మిశ్రమాన్ని జుట్టు కుదుళ్ల నుంచి చివర్ల వరకు పట్టించి షవర్ క్యాప్ ధరించాలి.గంట అనంతరం తలస్నానం చేయాలి.
ఇలా చేస్తే డ్రై హెయిర్ సమస్య దూరం అవుతుంది.కురులు స్మూత్ గా సిల్కీగా మారతాయి.
ఇక చుండ్రు సమస్యతో( Dandruff problem ) బాధపడేవారు మూడు టేబుల్ స్పూన్ల అలోవెరా జెల్ తీసుకుని అందులో వన్ టేబుల్ స్పూన్ విటమిన్ ఈ ఆయిల్( Vitamin E oil ) వేసి బాగా కలపాలి.ఈ మిశ్రమాన్ని స్కాల్ప్ తో పాటు జుట్టు మొత్తానికి అప్లై చేసుకోవాలి.గంట అనంతరం తల స్నానం చేయాలి.
వారానికి రెండు సార్లు ఈ రెమెడీని పాటిస్తే చుండ్రు సమస్య పరార్ అవుతుంది.
తాజా వార్తలు
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy