వాషింగ్ మెషిన్ లో బట్టలు ఇలా ఉతికితే బట్టలు ఎప్పటికి కొత్తవాటిలా తళ తళ మెరుస్తాయి

ఒకప్పుడు బట్టలు ఉతకటం అంటే ఒక పెద్ద పని.

బకెట్ నీటిలో సర్ఫ్ వేసి బట్టలను అరగంట నానబెట్టి ఆ తర్వాత బట్టలను ఒకొక్కటిగా తీసి సబ్బు పెట్టి ఉతికి జాడించి ఆరవేసేవాళ్ళం.

ఇపుడైతే వాషింగ్ మిషన్స్ వచ్చేసాయి.బట్టలు ఉతకటం చాలా సులభం అయిపోయింది.

బట్టలు మిషన్ లో వేసి సర్ఫ్ వేసి టైం సెట్ చేస్తే ఆరిన బట్టలు బయటకు వస్తాయి.అయితే వాషింగ్ మెషిన్ లో బట్టలను ఉతికే సమయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోకపోతే బట్టల మన్నిక తగ్గిపోతుంది.

అందువల్ల జాగ్రత్తలను తప్పనిసరిగా తీసుకోవాలి.ఇప్పుడు ఆ జాగ్రత్తల గురించి వివరంగా తెలుసుకుందాం.

Advertisement

రెడీమేడ్‌ బట్టలను లేబుల్ పై రాసిన విధంగా ఉతికితే ఎక్కువ కాలం మన్నటమే కాకుండా రంగులు కూడా వెలవవు.బట్టలకు ఏమైనా మరకలు అంటితే మిగతా బట్టలతో కలిపి ఉతకకుండా వేరుగా ఉతకాలి.

ఒకవేళ కలిపి ఉతికితే ఆ మరకలు మిగతా వాటికీ అంటే ప్రమాదం ఉంది.వాషింగ్ మెషీన్‌పై ఉన్న సెట్టింగ్స్‌ ప్రకారమే బట్టలను ఉతకాలి.

ఏ ర‌క‌మైన దుస్తుల‌కు ఎలాంటి సెట్టింగ్స్ స‌రిపోతాయో చూసుకుని వాడితే దుస్తులు ఎక్కువ కాలం మన్నికగా ఉంటాయి.వాషింగ్ మిషన్ లో ప్యాంట్స్ వేసినప్పుడు తిరగేసి వేస్తె జిప్పులు పోయే ప్రమాదం ఉండదు.

వాషింగ్ మెషీన్‌లో డిటర్జెంట్‌ను ఎక్కువ తక్కువ కాకుండా స‌రైన మోతాదులోనే వేయాలి.డిటర్జెంట్‌ తక్కువ అయితే బట్టల మురికి వదలదు.ఎక్కువైతే డిటర్జెంట్‌ నురుగు వదలదు.

How Modern Technology Shapes The IGaming Experience
రాష్ట్రంలో కొత్తగా 1,506 కరోనా కేసులు..

అందువల్ల డిటర్జెంట్‌ మోతాదు సరిగ్గా ఉండాలి.మోతాదు సరిగ్గా ఉంటే బట్టల మన్నిక కూడా బాగుంటుంది.

Advertisement

డిట‌ర్జెంట్‌తోపాటు ఫ్యాబ్రిక్ సాఫ్టెన‌ర్‌ను కూడా వాడ‌డం మంచిది.ఎందుకంటే ఫ్యాబ్రిక్ సాఫ్టెన‌ర్‌ బట్టల మన్నికను పెంచటమే కాకుండా పోగులు రాకుండా చూస్తుంది.

వాషింగ్ మెషీన్‌లో ఉన్న డ్రైయ‌ర్ ని ఉపయోగించటం కంటే స‌హ‌జ సిద్ధంగా బ‌య‌ట ఆరేయ‌డమే మంచిది.దీని వల్ల బట్టలు ఎక్కువ కాలం మ‌న్నుతాయి.

తాజా వార్తలు