Fatigue Recovery Smoothie : చిన్న చిన్న పనుల‌కు కూడా అల‌సిపోతున్నారా? అయితే ఈ స్మూతీ మీకోసమే!

అలసట.సర్వ సాధారణంగా ఇబ్బంది పెట్టే సమస్యల్లో ఇది ఒకటి.

శ్రమకు మించి పని చేయడం, పోషకాల కొరత, ఆహారపు అలవాట్లు తదితర అంశాలు అలసటకు కారణాలు అవుతుంటాయి.అయితే కొందరు చిన్న చిన్న పనుల‌కు కూడా తీవ్రంగా అలసిపోతుంటారు.

కాస్త పెద్ద పనులు ఉన్నాయంటే ఇక అంతే సంగతులు.మీరు కూడా ఈ జాబితాలో ఉన్నారా? అయితే అస్స‌లు వర్రీ వద్దు.ఎందుకంటే ఇప్పుడు చెప్పబోయే స్మూతీని డైట్ లో చేర్చుకుంటే అలసట అన్నమాట.

మరి ఇంకెందుకు ఆలస్యం ఆ స్మూతీ ఏంటో.దాన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో.

Advertisement

తెలుసుకుందాం పదండి.ముందుగా ఒక కప్పు కొబ్బరి ముక్కలను తీసుకుని మిక్సీ జార్ లో వేసి వాటర్ పోసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.

ఇలా గ్రైండ్ చేసుకున్న‌ మిశ్రమం నుంచి ప‌ల్చ‌టి వస్త్రం సహాయంతో కొబ్బరి పాలను సపరేట్ చేసుకోవాలి.మ‌రోవైపు ఒక గిన్నెలో చిన్న కప్పు వాటర్ పోసి పావు టేబుల్ స్పూన్ కుంకుమపువ్వు వేసి నానబెట్టుకోవాలి.

ఆ తర్వాత ఒక అరటి పండును తీసుకుని పీల్‌ తొలగించే స్రైసెస్ గా కట్ చేసుకోవాలి.ఇప్పుడు బ్లెండర్ తీసుకుని అందులో కట్ చేసి పెట్టుకున్న అరటి పండు ముక్కలు, నైట్ అంతా వాటర్ లో నానబెట్టుకున్న ఎనిమిది పిస్తా పప్పులు, రెండు గింజ తొలగించిన ఖర్జూరాలు, వన్ టేబుల్ స్పూన్ బెల్లం పొడి, పావు టేబుల్ స్పూన్ యాలకుల పొడి, ఒక గ్లాసు కొబ్బరి పాలు వేసుకోవాలి.

చివరగా నానబెట్టుకున్న కుంకుమపువ్వు వాటర్ తో సహా వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకుంటే మన స్మూతీ సిద్దం అవుతుంది.ఈ స్మూతీ టేస్టీగా ఉండ‌డ‌మే కాదు ఆరోగ్యానికి సైతం ఎంతో మేలు చేస్తుంది.ఈ స్మూతీని డైట్ లో చేర్చుకుంటే అలసట, నీరసం వంటివి దరిదాపుల్లోకి రాకుండా ఉంటాయి.

ఓట్స్ ఆరోగ్యాన్నే కాదు హెయిర్ గ్రోత్ ను పెంచుతాయి.. ఇంతకీ ఎలా వాడాలంటే?
రూ.10 లక్షల విరాళం ప్రకటించినా రష్మికపై ట్రోల్స్.. అలా చేయడమే తప్పైందా?

రక్తహీనత, బలహీనత వంటివి దూరం అవుతాయి.ఎముకలు దృఢంగా మారతాయి.

Advertisement

సన్నగా పీలగా ఉన్నవారు హెల్తీగా వెయిట్ గెయిన్ అవుతారు.మరియు ఈ స్మూతీని తీసుకోవడం వల్ల రక్తపోటు సైతం అదుపులో ఉంటుంది.

తాజా వార్తలు