ఎండల వల్ల చేతులు నల్లగా మారాయా.. డోంట్ వర్రీ ఇలా చేయండి!

అసలే వేసవి కాలం.( Summer ) ఎంత ఖరీదైన సన్ స్క్రీన్ లోషన్ వాడినప్పటికీ ఈ ఎండల్లో తిరిగితే దెబ్బకు చర్మం టాన్ అయిపోతుంటుంది.

అయితే చాలా మంది బయటకు వెళ్లేటప్పుడు ముఖాన్ని ఏదో ఒక విధంగా కవర్ చేసుకుంటారు.కానీ చేతులు మాత్రం మర్చిపోతుంటారు.

దాంతో చేతులు బాడీ తో సంబంధం లేకుండా ఎండల దెబ్బకు నల్లగా ( Dark Hands ) మారిపోతుంటాయి.అలాంటి సమయంలో చేతులను ఎలా రిపేర్ చేసుకోవాలో తెలియక తెగ మదన పడుతూ ఉంటారు.

మీరు ఈ జాబితాలో ఉన్నారా.అయితే డోంట్ వర్రీ.

Advertisement

ఎండల వల్ల నల్లగా మారిన చేతులను రిపేర్ చేయడానికి ఇప్పుడు చెప్పబోయే సింపుల్ చిట్కా సూపర్ ఎఫెక్టివ్ గా పని చేస్తుంది.ఈ సింపుల్ చిట్కాను పాటిస్తే సులభంగా చేతులను తెల్లగా మార్చుకోవచ్చు.

మరి ఇంకెందుకు ఆలస్యం ఆ సింపుల్ చిట్కా ఏంటో ఓ చూపు చూసేయండి.ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో వన్ టేబుల్ స్పూన్ రైస్ ఫ్లోర్,( Rice Flour ) వన్ టేబుల్ స్పూన్ కాఫీ పౌడర్,( Coffee Powder ) వన్ టేబుల్ స్పూన్ బేకింగ్ పౌడర్, వన్ టేబుల్ స్పూన్ షుగర్ పౌడర్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి.

ఇప్పుడు ఇందులో ఐదు నుంచి ఆరు టేబుల్ స్పూన్లు లెమన్ జ్యూస్ వేసి బాగా మిక్స్ చేసుకోవాలి.ఇలా తయారు చేసుకున్న మిశ్రమాన్ని చేతులకు అప్లై చేసుకుని ఐదు నిమిషాల పాటు ఆరబెట్టుకోవాలి.ఆపై అర నిమ్మ చక్కని తీసుకుని చేతులను బాగా రుద్దాలి.

కనీసం ఐదు నిమిషాల పాటు చేతులను నిమ్మ చెక్కతో రబ్ చేసుకుని ఇప్పుడు వాటర్ తో శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి.

కల్కి పై మోహన్ బాబు రివ్యూ...భారీగా ట్రోల్ చేస్తున్న నెటిజన్స్!
స్కిన్ వైటెనింగ్ కోసం ఆరాట‌ప‌డుతున్నారా? అయితే ఈ ఆయిల్ మీకోస‌మే!

చివరిగా చేతులకు ఏదైనా మంచి మాయిశ్చరైజర్ ను అప్లై చేసుకోవాలి.రోజుకి ఒక్కసారి ఈ సింపుల్ చిట్కాను పాటిస్తే ఎండల వల్ల చేతులు ఎంత నల్లగా మారినా సరే మళ్లీ పూర్వ స్థితికి వస్తాయి.చేతులు తెల్లగా కాంతివంతంగా మారతాయి.

Advertisement

కాబట్టి ఎండల వల్ల చేతులు నల్లగా మారాయి అని బాధపడుతున్న వారు ఈ రెమెడీని తప్పకుండా పాటించండి.పైగా ఈ రెమెడీ పాదాలు, మెడ, అండర్ ఆర్మ్స్ న‌లుపును వదిలించడానికి కూడా అద్భుతంగా సహాయపడుతుంది.

తాజా వార్తలు