నిద్ర‌లేమితో స‌త‌మత‌మ‌వుతున్నారా? అయితే మీరీ జావ తాగాల్సిందే!

ఇటీవ‌ల రోజుల్లో స్త్రీ, పురుషులు అనే తేడా లేకుండా ఎంద‌రినో బాధిస్తున్న సమ‌స్య‌ల్లో నిద్ర‌లేమి ఒక‌టి.పోష‌కాల కొర‌త‌, స్మార్ట్ ఫోన్ల‌ను అధికంగా వినియోగించ‌డం, నిద్ర‌ను నిర్ల‌క్ష్యం చేయ‌డం, ఒత్తిడి, మ‌ద్య‌పానం వంటివి నిద్ర లేమి స‌మ‌స్య‌కు ప్ర‌ధాన కార‌ణాలు.

నిద్ర‌లేమి వ‌ల్ల మ‌నిషి మాన‌సికంగానే కాకుండా శ‌రీర‌కంగానూ కృంగిపోతాడు.అందుకే ఈ స‌మ‌స్య‌ను ఎంత తొంద‌ర‌గా వ‌దిలించుకుంటే ఆరోగ్యానికి అంత మంచిద‌ని నిపుణులు చెబుతుంటారు.

అయితే నిద్ర‌లేమిని నివారించ‌డంలో ఇప్పుడు చెప్ప‌బోయే జావ అద్భుతంగా స‌హాయ‌ప‌డుతుంది.మ‌రి ఆ జావ ఏంటీ.? దాన్ని ఎలా త‌యారు చేయాలి.? వంటి విష‌యాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం.ముందుగా స్ట‌వ్ పై ప్యాన్ పెట్టుకుని అందులో ఎనిమిది స్పూన్లు బార్లీ గింజ‌లు, ఒక స్పూన్ జీల‌క‌ర్ర‌, ప‌ది మిరియాలు వేసి లైట్‌గా ఫ్రై చేసుకుని.

ఆపై చ‌ల్లార‌ బెట్టుకోవాలి.ఇప్పుడు మిక్సీ జార్‌లో ఈ ముడిటినీ తీసుకుని మెత్త‌గా పొడి చేసుకోవాలి.

Best Home Remedy To Get Rid Of Sleeping Problem Details Sleeping Problem, Lates
Advertisement
Best Home Remedy To Get Rid Of Sleeping Problem Details! Sleeping Problem, Lates

ఆ త‌ర్వాత ఒక గిన్నె తీసుకుని అందులో గ్లాస్ వాట‌ర్ పోసి హీట్ చేయాలి.నీరు కాస్త వేడి అవ్వ‌గానే.త‌యారు చేసుకున్న పొడిని రెండు స్పూన్లు వేసి ఉండ‌లు క‌ట్ట‌కుండా క‌లుపుకోవాలి.

ఇప్పుడు ప‌ది నిమిషాల పాటు గ‌రిటెతో తిప్పుకుంటూ ఉడికించుకుని.ఆపై స్ట‌వ్ ఆఫ్ చేయాలి.

ఈ మిశ్ర‌మం కాస్త చ‌ల్లార‌క‌.ఇందులో ఒక గ్లాస్ మ‌జ్జిగ, చిటికెడు ఉప్పు క‌లిపితే జావ సిద్ధ‌మైట్టే.

Best Home Remedy To Get Rid Of Sleeping Problem Details Sleeping Problem, Lates

వారంలో రెండంటే రెండు సార్లు ఈ జావ తీసుకోవ‌డం వ‌ల్ల నిద్ర లేమి స‌మ‌స్య క్ర‌మంగా దూరం అవుతుంది.రాత్రుళ్లు మంచిగా నిద్ర ప‌డుతుంది.అంతే కాదు, ఈ జావ తాగితే వెయిట్ లాస్ అవుతారు.

వారంలో 2 సార్లు ఈ రెమెడీని ట్రై చేస్తే మెడ న‌లుపు మాయం!

త‌ల‌నొప్పి, ఒత్తిడి స‌మ‌స్య‌లు ప‌రార్ అవుతాయి.ఒంట్లో అధిక వేడి త‌గ్గుతుంది.

Advertisement

మ‌రియు క‌ళ్లు మంట‌ల నుంచి కూడా ఉప‌శ‌మ‌నం ల‌భిస్తుంది.

తాజా వార్తలు