వర్షాకాలంలో రోజు ఉదయం ఈ హెర్బల్ టీ తాగితే మీ ఆరోగ్యం పదిలమే!

ప్రస్తుత వర్షాకాలంలో ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని నిపుణులు పదే పదే సూచిస్తుంటారు.ఎందుకంటే వర్షాకాలం వ్యాధుల కాలం.

ఏ మాత్రం అజాగ్రత్తగా వ్యవహరించిన ఆరోగ్యం పాడవుతుంది.అయితే వర్షాకాలంలో కొన్ని కొన్ని ఆహారాలు మన ఆరోగ్యానికి రక్షణ కవచంగా మారుతుంటాయి.

అటువంటి వాటిలో ఇప్పుడు చెప్పబోయే హెర్బల్ టీ కూడా ఒకటి.ఈ హెర్బల్ టీ ( Herbal tea )ను ప్రస్తుత వర్షాకాలంలో ప్రతిరోజు ఉదయం తీసుకుంటే మీ ఆరోగ్యం పదిలం.

మరి ఇంకెందుకు ఆలస్యం ఆ హెర్బల్ టీ ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకుందాం పదండి.

Advertisement

స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకుని ఒకటిన్నర గ్లాస్ వాటర్ పోసుకోవాలి.వాటర్ హీట్‌ అవ్వగానే అందులో ఫ్రెష్ గా ఉన్న పది పుదీనా( Mint ) ఆకులను వేసుకోవాలి.అలాగే రెండు అల్లం స్లైసెస్, అంగుళం దాల్చిన చెక్క, రెండు పచ్చి పసుపు కొమ్ము స్లైసెస్ వేసి వాటర్ సగం అయ్యేంత వరకు మరిగించాలి.

ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసి మరిగించిన వాటర్ ను ఫిల్టర్ చేసుకోవాలి.ఈ వాటర్ లో వన్ టేబుల్ స్పూన్ తేనె కలిపితే మన హెర్బల్ టీ సిద్ధం అయినట్టే.

రోజు ఉదయం ఈ హెర్బల్ టీను తీసుకుంటే ఆరోగ్యానికి చాలా మేలు జరుగుతుంది.ముఖ్యంగా ఈ టీ ఇమ్యూనిటీ సిస్టమ్‌ను స్ట్రాంగ్ గా మారుస్తుంది.సీజనల్ వ్యాధులు దరిదాపుల్లోకి రాకుండా అడ్డుకుంటుంది.

జలుబు, దగ్గు, గొంతు నొప్పి, గొంతు వాపు వంటి సమస్యలు ఉంటే దూరం అవుతాయి.తీవ్రమైన తలనొప్పి, ఒత్తిడి, డిప్రెషన్ వంటి సమస్యల నుంచి క్షణాల్లో రిలీఫ్ ను అందిస్తుంది.

మీరు 11 వ తారీఖున జన్మించారా....అయితే మీ లక్షణాలు ఎలా ఉంటాయో తెలుసా?

మెదడు పనితీరును మెరుగుపరుస్తుంది.అలాగే ఈ హెర్బల్ టీ రెగ్యుల‌ర్ డైట్ లో ఉంటే గ్యాస్, ఎసిడిటీ, మవబద్ధకం వంటి సమస్యలు ద‌రిచేర‌కుండా ఉంటాయి.

Advertisement

వర్షాకాలంలో చాలామంది వ్యాయామాలను నిర్లక్ష్యం చేస్తుంటారు.దీంతో వెయిట్ గెయిన్‌ అవుతారు.

అయితే ఈ హెర్బల్ టీ క్యాలరీలను కరిగిస్తుంది.వెయిట్ లాస్ ( Weight loss )కు సహాయపడుతుంది.

ఈ హెర్బల్ టీ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ తో పోరాడే శక్తి, సామర్థ్యాన్ని మీకు అందిస్తుంది.అదే సమయంలో హార్మోన్లను బ్యాలెన్స్ చేస్తుంది.

మరియు స్త్రీలలో నెలసరి నొప్పులను నివారించడానికి కూడా ఈ హెర్బల్ టీ గ్రేట్ గా హెల్ప్ చేస్తుంది.

తాజా వార్తలు