నవరాత్రులలో ఉపవాసం ఉండే వారు ఈ పానీయాలు తీసుకోవడం మంచిదా..?

ప్రస్తుత సమాజంలో చాలామంది ప్రజలు పండుగ రోజులలో ఉపవాసం ఉంటున్నారు.ఉపవాసం పాటించడం అనేది చాలా కఠినమైన దీక్ష.

నవరాత్రుల్లో ఉపవాసం ఉండేవారి శరీరానికి ఎన్నో రకాల పోషకాలు, విటమిన్లు అవసరమవుతాయి.ఇలాంటి సమయంలో కొన్ని పానీయాలను తాగితే బలహీనత, అలసట దూరం అవుతాయి.

నవరాత్రి సందర్భంగా అమ్మవారికి కోసం ఉపవాసం ఉండేవారు చాలా మందే ఉన్నారు.ఈ నవరాత్రుల్లో ఉపవాసం ఉండేవారు ఉల్లిపాయలు, వెల్లుల్లి, మాంసం, గుడ్లు, ఆల్కహాల్ కి దూరంగా ఉండాలి.

ఇలాంటి సమయంలో తేలికపాటి ఆహారాన్ని మాత్రమే తీసుకోవాల్సి ఉంటుంంది.ఉపవాసం వల్ల శరీరంలో శక్తి తగ్గుతుంది.

Advertisement
Best Healthy Drinks For Who Are Fasting In Navaratri Details, Best Healthy Drink

ఉపవాసం ఉండేవారికి ఎన్నో రకాల పోషకాలు, విటమిన్లు అవసరమవుతాయి.ఉపవాస సమయంలో శరీరం హైడ్రేట్ గా ఉండాలంటే హెల్తీ పానీయాలను,పండ్లను తీసుకోవాలి.

ఎబిసి జ్యూస్ ను ఆపిల్, దుంపలు, క్యారెట్ లతో తయారు చేస్తారు.ఈ డిఫరెంట్ కాంబినేషన్ లో ఉన్న ఈ జ్యూస్ ఆరోగ్యానికి చాలా మంచిది.

ఆపిల్, దుంపలు, క్యారెట్ లో ఎన్నో రకాల విటమిన్లు, ఫైబర్స్, యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి.అలాగే శరీరం నుండి వ్యర్ధాలను బయటకు పంపుతుంది.

అధిక రక్తపోటును కూడా తగ్గించడానికి ఉపయోగపడుతుంది.ఈ జ్యూస్ తాగడం వల్ల జీర్ణక్రియ ప్రక్రియ సక్రమంగా జరుగుతుంది.

Best Healthy Drinks For Who Are Fasting In Navaratri Details, Best Healthy Drink
శ‌రీరంలో హిమోగ్లోబిన్ లెవ‌ల్స్ ను పెంచే పండ్లు ఇవే..!
రామ్ చరణ్ సక్సెస్ ఫుల్ లైనప్ ను సెట్ చేసుకున్నాడా..?

అలాగే కళ్లు, చర్మం ఆరోగ్యానికి కూడా ప్రయోజనకరంగా ఉంటుంది.ఇందుకోసం తొక్క తీసిన ఆపిల్ పండు, సగం బీట్ రూట్, ఒక క్యారెట్, ఒక కప్పు నీటిని గ్రైండర్ లో వేసి జ్యూస్ చేసుకోవాలి.దీనికి తేనే కలిపి తాగితే రుచిగా ఉంటుంది.

Advertisement

సిట్రస్ పండ్లలో విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది.సిట్రస్ పండ్లైన నిమ్మ, నారింజ, ద్రాక్ష వంటి పండ్లన్నీ మన శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి.

వీటిలో ఉండే పెక్టిన్ ఫైబర్, లిమోనాయిడ్ సమ్మేళనాలు రక్తనాళాలను ఆరోగ్యంగా ఉంచుతాయి.సిట్రస్ పండ్లలో ఉండే యాంటీఆక్సిడెంట్లు గుండెపోటు ప్రమాదాన్ని కూడా తగ్గిస్తాయి.

ఈ జ్యూస్ జీర్ణక్రియ సక్రమంగా పనిచేసేందుకు సహాయపడుతుంది.

తాజా వార్తలు