ఈ డిటాక్స్ డ్రింక్ తో బాడీ క్లీన్ గానే కాదు మీరు ఫిట్ గా కూడా మారతారు!

బాడీని ఎప్పుడు పైపైనే కాదు అంతర్గతంగా కూడా క్లీన్ గా ఉంచుకోవాలి.లేదంటే శరీరంలో వ్యర్థాలు పేరుకుపోయాయి.

దీంతో అంతర్గత అవయవాల పనితీరు నెమ్మదిస్తుంది.అలాగే అనేక జబ్బులను ఏరికోరి ఆహ్వానించినట్లు అవుతుంది.

అందుకే బాడీని డిటాక్స్ చేసుకోవాలి.అయితే ఇప్పుడు చెప్పబోయే డిటాక్స్ డ్రింక్ ను కనుక డైట్ లో చేర్చుకుంటే బాడీ క్లీన్ అవ్వడమే కాదు మీరు ఫిట్ గా కూడా మారతారు.

మరి ఇంకెందుకు ఆలస్యం ఆ డిటాక్స్ డ్రింక్ ను ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకుందాం పదండి.

Advertisement

ముందుగా ఒక కీర దోసకాయ( Cucumbe ) తీసుకుని ఉప్పు నీటిలో శుభ్రంగా కడిగి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి.అలాగే అర అంగుళం అల్లం ముక్కను తీసుకుని వాటర్ తో శుభ్రంగా కడిగి పీల్ తొలగించి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి.చివ‌రిగా పది ఫ్రెష్ పుదీనా ఆకులు కడిగి పెట్టుకోవాలి.

ఆ తర్వాత బ్లెండర్ తీసుకుని అందులో కట్ చేసి పెట్టుకున్న కీర దోసకాయ ముక్కలు, అల్లం ముక్క‌లు మరియు పుదీనా ఆకులు వేసుకోవాలి.

అలాగే ఒక గ్లాసు ఫ్రెష్ కొబ్బరి నీళ్లు( coconut water ) వేసుకుని ఐదారు నిమిషాల పాటు గ్రైండ్ చేసుకోవాలి.తద్వారా మన డిటాక్స్ డ్రింక్ సిద్దం అవుతుంది.ఈ డిటాక్స్ డ్రింక్ ను రోజు మార్నింగ్ తీసుకుంటే శరీరంలో పేరుకుపోయిన వ్యర్థాలు, మలినాలు తొలిగిపోతాయి.

బాడీ శుభ్రంగా మారుతుంది.అంతర్గత అవయవాల పనితీరు మెరుగుపడుతుంది.

వారానికి 2 సార్లు ఈ ఆయిల్ ను వాడితే హెయిర్ ఫాల్, వైట్ హెయిర్ రెండింటికి చెక్!
ఎన్టీఆర్ ఫ్యాన్స్ సపోర్ట్ లేకుండా డాకు మహారాజ్ హిట్టవుతుందా.. ఆ రేంజ్ కలెక్షన్లు వస్తాయా?

అలాగే ఈ డిటాక్స్ డ్రింక్ ను డైట్ లో చేర్చుకుంటే మెటబాలిజం రేటు ఇంప్రూవ్ అవుతుంది.దీంతో శరీరంలో అధిక క్యాలరీలు కరుగుతాయి.

Advertisement

ఫలితంగా వెయిట్ లాస్( Weight loss ) అవుతారు.ఫిట్ గా మారతారు.

అంతేకాదు, ఈ డిటాక్స్ డ్రింక్ మిమ్మల్ని రోజంతా యాక్టివ్ గా ఉంచుతుంది.ఎనర్జీ లెవెల్స్ ను పెంచుతుంది.

మీ బాడీని హైడ్రేటెడ్ గా ఉంచుతుంది.జీర్ణ వ్యవస్థ పనితీరును ఇంప్రూవ్ చేస్తుంది.

మరియు మీ చర్మాన్ని కాంతివంతంగా నిగారింపుగా మెరిపిస్తుంది.కాబట్టి హెల్తీ గా ఫిట్ గా ఉండాలని కోరుకునే వారు తప్పకుండా ఈ డిటాక్స్ డ్రింక్ రెగ్యులర్ డైట్ లో చేర్చుకోండి.

తాజా వార్తలు