ఈ డిటాక్స్ డ్రింక్ బాడీని క్లీన్ చేయడమే కాదు బరువును తగ్గిస్తుంది.. తెలుసా?

ఆహారపు అలవాట్లు, పెరిగిన కాలుష్యం, ధూమపానం, మద్యపానం త‌దితర కారణాల వల్ల శరీరంలో మ‌లినాలు పేరుకుపోతూ ఉంటాయి.వాటిని ఎప్పటికప్పుడు తొలగించుకుంటూ ఉండాలి.

లేదంటే ఆ మలినాలు అంత‌ర్గ‌త అవయవాల పనితీరును దెబ్బతీస్తాయి.దాంతో అనేక అనారోగ్య సమస్యలు చుట్టుముడతాయి.

అందుకే బాడీని డిటాక్స్ చేసుకోవడం ఎంతో ముఖ్యం.అయితే అందుకు ఇప్పుడు చెప్పబోయే డ్రింక్ చాలా ఉత్తమంగా సహాయపడుతుంది.

డిటాక్స్ డ్రింక్( Detox drink ) ను తీసుకోవడం వల్ల బాడీ క్లీన్ అవ్వడమే కాదు వెయిట్ లాస్ కూడా అవుతారు.మరి ఇంకెందుకు ఆలస్యం ఆ డిటాక్స్ డ్రింక్ ను ఎలా తయారు చేసుకోవాలో ఓ చూపు చూసేయండి.

Advertisement

ముందుగా ఆఫ్ కీర దోసకాయ( Cucumber ) తీసుకుని సన్నగా స్లైసెస్ మాదిరి కట్ చేసి పెట్టుకోవాలి.అలాగే అర అంగుళం అల్లం ముక్క, అర అంగుళం ప‌చ్చి ప‌సుపు కొమ్ము( Greenish yellow horn ) తీసుకుని పొట్టు తొలగించి వాటర్ తో కడిగి దంచి పెట్టుకోవాలి.

ఆ తర్వాత ఒక గ్లాస్ జార్ తీసుకుని అందులో దంచి పెట్టుకున్న అల్లం ముక్క, ప‌చ్చి ప‌సుపు కొమ్ము, నాలుగు లేదా ఐదు కీరా దోసకాయ స్లైసెస్, రెండు లెమన్ స్లైసెస్( Lemon slices ), ఐదు ఫ్రెష్ పుదీనా ఆకులు, రెండు టేబుల్ స్పూన్లు లెమన్ జ్యూస్ వేసుకోవాలి.

చివరిగా రెండు గ్లాసుల వాటర్ పోసి బాగా మిక్స్ చేసి ఓవర్ నైట్ వదిలేయాలి.మరుసటి రోజు ఉదయాన్నే వాటర్ ను ఫిల్టర్ చేసుకుని అందులో వన్ టేబుల్ స్పూన్ నానబెట్టుకున్న చియా సీడ్స్ వేసి సేవించాలి.ఖాళీ కడుపుతో ఈ డ్రింక్ ను తీసుకుంటే శరీరంలో పేరుకుపోయిన మలినాలన్నీ తొలగిపోతాయి.

బాడీ క్లీన్ గా మారుతుంది.

Amerio Erfahrungen Und Reputation : Eine Analytische Einordnung
టమాటాలు ఇలా తింటే రిస్క్‌లో ప‌డిన‌ట్టే!!

అలాగే ఈ డిటాక్స్ డ్రింక్ మెటబాలిజం రేటు అద్భుతంగా పెంచుతుంది.దీని కారణంగా క్యాలరీలు త్వరగా బర్న్ అవుతాయి.ఫలితంగా వెయిట్ లాస్ అవుతారు.

Advertisement

బాన పొట్టను కరిగించడానికి కూడా ఈ డిటాక్స్ డ్రింక్ గ్రేట్ గా సహాయపడుతుంది.కాబట్టి బాడీని క్లీన్ గా ఉంచుకోవడానికి మరియు వెయిట్ లాస్ అవ్వడానికి తప్పకుండా ఈ డ్రింక్ ను డైట్ లో చేర్చుకోండి.

తాజా వార్తలు