బ్రెయిన్ షార్ప్ అవ్వాలా? అయితే మీ బ్రేక్ ఫాస్ట్‌లో ఈ ఫుడ్స్ ఉండాల్సిందే!

బ్రెయిన్ షార్ప్‌గా ప‌ని చేస్తే మ‌నం కోరుకున్న రంగంలో మ‌రింత వేగంగా ఎదుగుతాము.

అందుకే మెద‌డు ఆరోగ్య ప‌ట్ల ప్ర‌త్యేక‌ శ్ర‌ద్ధ వ‌హించాల‌ని ఆరోగ్య నిపుణులు ఎప్ప‌టిక‌ప్పుడు చెబుతుంటారు.

లేదంటే చిన్న వ‌య‌సులోనే జ్ఞాప‌క శ‌క్తి, ఆలోచ‌నా శ‌క్తి రెండూ త‌గ్గిపోతాయి.అయితే మెద‌డు ప‌ని తీరును పెంచ‌డంలో ఇప్పుడు చెప్ప‌బోయే ఫుడ్స్ గ్రేట్‌గా స‌హాయ‌ప‌డ‌తాయి.

ఆ ఫుడ్స్‌ను బ్రేక్ ఫాస్ట్ స‌మ‌యంలో తీసుకుంటే గ‌నుక మీ బ్రెయిన్ షార్ప్‌గా మార‌డం ఖాయం.మ‌రి ఇంకెందుకు ఆల‌స్యం ఆ ఫుడ్స్ ఏంటో తెలుసుకుందాం ప‌దండీ.

వాల్ న‌ట్స్‌.మెద‌డును చుర‌గ్గా మార్చ‌డంలో ఇవి అద్భుతంగా స‌హాయ‌ప‌డ‌తాయి.

Advertisement

మూడు నుంచి నాలుగు వాల్ న‌ట్స్‌ను నైట్ నిద్రించే ముందే నీటిలో నాన‌బెట్టుకుని.ఉద‌యం బ్రేక్ ఫాస్ట్ స‌మ‌యంలో తినేయాలి.

ఇలా ప్ర‌తి రోజు చేస్తే మీ బ్రెయిన్ సూప‌ర్ షార్ప్‌గా మారుతుంది.వాల్ న‌ట్స్‌తో పాటు రెండు బాదం ప‌ప్పులు, రెండు పిస్తా ప‌ప్పులు తీసుకుంటే ఇంకా మంచిది.

సంపూర్ణ పోష‌కాహారం అయిన గుడ్డు కూడా మెద‌డు ఆరోగ్యాన్ని పెంచుతాయి.అందువ‌ల్ల‌, రెగ్యుల‌ర్‌గా బ్రేక్ ఫాస్ట్ స‌మ‌యంలో ఒక ఉడికించిన గుడ్డును తినాల‌ని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.

ప‌సుపు టీ.ఆరోగ్యానికే కాదు మెద‌డుకు ఎంతో మేలు చేస్తుంది.పాల‌తో త‌యారు చేసే టీ, కాఫీల‌కు బ‌దులు.

మచ్చలు పోయి ముఖం తెల్లగా మారాలా.. అయితే ఈ రెమెడీని మీరు ట్రై చేయాల్సిందే!

బ్రేక్ ఫాస్ట్ టైమ్‌లో ఒక క‌ప్పు ప‌సుపు టీని తీసుకుంటే బ్రెయిన్ షార్ప్‌గా మారుతుంది.వెయిట్ లాస్ అవుతారు.

Advertisement

కీళ్ల నొప్ప‌లు దూరం అవుతాయి.మ‌రియు ఇమ్యూనిటీ సిస్థ‌మ్ సైతం స్ట్రోంగ్‌గా మారుతుంది.

ఒక‌వేళ మీకు ప‌సుపు ఇష్టం లేకుంటే గ్రీన్ టీ అయినా తీసుకోవ‌చ్చు.ఇక బ్రేక్‌ఫాస్ట్‌లో అవ‌కాడో, యాపిల్‌, స్ట్రాబెర్రీ, బ‌న‌నా వంటి పండ్ల‌తో త‌యారు చేసే స్మూతీల‌ను తీసుకోవ‌చ్చు.

ఇవి కూడా మెద‌డు ప‌ని తీరును పెంచుతాయి.

తాజా వార్తలు