కంటెంట్ క్రియేటర్లకు ఉపయోగపడే ఏఐ టూల్స్ ఇవే.. వీటితో కంటెంట్ క్రియేట్ మరింత సులభతరం..!

యూట్యూబ్, ఇంస్టాగ్రామ్, ఫేస్ బుక్ లలో చాలామంది కంటెంట్ క్రియేట్ చేస్తుంటారు.

అయితే కంటెంట్ క్రియేటర్లకు( Content Creators ) ఉపయోగపడే ఏఐ టూల్స్ గురించి తెలుసుకుందాం.

ఏఐ టూల్స్ తో( AI Tools ) కంటెంట్ క్రియేషన్ లో రైటింగ్, ఆడియో క్రియేషన్, గ్రాఫిక్ డిజైనింగ్ లాంటి పలు రకాల పనులు మరింత సులభతరం అవుతాయి.ఎందుకంటే అన్ని పనులు ఒకరే చేయాలంటే ఎక్కువ సమయం పడుతుంది.

కంటెంట్ క్రియేటర్లకు ఉపయోగపడే టూల్స్ ఏవో తెలుసుకుందాం.

చాట్ జీపీటీ:

ఎలాంటి టెక్స్ట్ కంటెంట్ ను అయిన సులభంగా క్రియేట్ చేయాలంటే చాట్ జీపీటీ( Chat GPT ) ఉపయోగించి క్రియేట్ చేయవచ్చు కానీ ఏవైనా కొత్త ఐడియాల కోసం లేదా రీసెర్చ్ చేయడం కోసం ఈ టూల్స్ ఉపయోగించుకోవచ్చు.

ఫైర్ ఫ్లై:

Advertisement

కంటెంట్ కు తగ్గ ఇమేజ్ క్రియేట్ చేయడం ఎంత కష్టమో, ఎంత సమయం పడుతుందో తెలిసిందే.కంటెంట్ కు తగ్గ ఇమేజ్ ఉంటేనే ఆ కంటెంట్ అద్భుతంగా కనిపిస్తుంది.కంటెంట్ కు తగ్గ ఇమేజ్ క్రియేట్ చేయడం కోసం అడోబీ ఫైర్ ఫ్లై టూల్( Adobe Firefly ) చాలా బాగా ఉపయోగపడుతుంది.

విడ్ ర్యాపిడ్:

ఈ టూల్ సహాయంతో వీడియోలో ఉండే కంటెంట్ ను టెక్స్ట్ రూపంలోకి కన్వర్ట్ చేయవచ్చు.ఈ టూల్ సహాయంతో ఆన్లైన్ లోని ఏ వీడియోకి అయినా ట్రాన్స్ క్రిప్షన్( Transcription ) పొందవచ్చు.అంతేకాదు వీడియోలో ఉండే కంటెంట్ ను షార్ట్ కంటెంట్ గా కూడా మార్చవచ్చు.

డీప్ ఎల్:

కంటెంట్ ను మీకు నచ్చిన భాష లోకి ట్రాన్స్ లేట్ చేసుకోవడానికి ఈ టూల్ చాలా బాగా ఉపయోగపడుతుంది.ఫారిన్ లాంగ్వేజ్ లకు కూడా ఈ డీప్ ఎల్( DeepL ) టూల్ సపోర్ట్ చేస్తుంది.

గైడ్:

గైడ్ టూల్( Guidde ) సహాయంతో జనరల్ కంటెంట్ మాత్రమే కాదు బిజినెస్ ప్రజెంటేషన్స్ కు కూడా ఉపయోగపడుతుంది.ఈ టూల్ తో టెక్స్ట్ టు వాయిస్ ఓవర్, టెక్స్ట్ హైలైటింగ్, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్, స్క్రీన్ రికార్డింగ్ లాంటి వాటికి ఈ టూల్ చాలా బాగా ఉపయోగపడుతుంది.ఈ ఏఐ టూల్స్ సహాయంతో కంటెంట్ క్రియేటర్లు తక్కువ సమయంలో అద్భుతమైన కంటెంట్లను క్రియేట్ చేయవచ్చు.

పుష్ప 2 అనుకున్న రేంజ్ లో ఆడకపోతే ఎవరికి ఎక్కువ నష్టం వస్తుంది...
Advertisement

తాజా వార్తలు