చర్మ సమస్యల పరిష్కారానికి....శనగపిండి

బయట ఎక్కువగా తిరిగే కాలేజ్ అమ్మాయిలకు మరియు ఉద్యోగం చేసే మహిళలు తరచుగా ముఖం మీద టాన్ తో ఇబ్బంది పడుతూ ఉంటారు.

ఈ సమస్యను శనగపిండితో సులభంగా తగ్గించుకోవచ్చు.

ముఖంపై పేరుకున్న టాన్ తొలగించటానికి.ఒక బౌల్ లో శనగపిండి,కొంచెం పాలు, తేనే వేసి బాగా కలిపి ముఖానికి పట్టించి ఆరిన తర్వాత పాలను ముఖంపై జల్లి మసాజ్ చేసి ఆ తర్వాత ముఖాన్ని శుభ్రంగా కడగాలి.

ముఖంపై జిడ్డు సమస్య తొలగాలంటే.ఒక బౌల్ లో శనగపిండి,కొంచెం రోజ్ వాటర్,పెరుగు వేసి బాగా కలపాలి.

ఈ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి ఆరాక చల్లని నీటితో శుభ్రం చేసుకోవాలి.ఈ విధంగా ప్రతి రోజు చేస్తూ ఉంటే క్రమంగా జిడ్డు తొలగిపోతుంది.

Advertisement

ముఖంపై పేరుకున్న దుమ్ము పోవాలంటే.ఒక బౌల్ లో శనగపిండి,పాలు పోసి మెత్తని పేస్ట్ చేసి దానికి పంచదార కలపాలి.

ఈ మిశ్రమాన్ని ముఖానికి రాసి మృదువుగా రుద్దాలి.ఈ విధంగా చేస్తే ముఖంపై పేరుకున్న దుమ్ము,ధూళి తొలగిపోతాయి.

Advertisement

తాజా వార్తలు