Benjamin Netanyahu Israel : బిగ్ బ్రేకింగ్ : ఇజ్రాయిల్ లో మళ్లీ అధికారం కైవాసం చేసుకున్న బెంజమిన్ నెతన్యహు..!!

ఇజ్రాయిల్ లో కొద్ది నెలల క్రితం రాజకీయ సంక్షోభం ఏర్పడిన సంగతి తెలిసిందే.

మాజీ ప్రధానమంత్రి నఫ్తాలి బెన్నెట్ ప్రభుత్వం పడిపోవడంతో మళ్లీ ఎన్నికలు రావడం జరిగింది.

నవంబర్ నెలలో జరిగిన ఎన్నికలలో నఫ్తాలి బెన్నెట్ కి ముందు అధికారంలో బెంజమిన్ నెతన్యహు అధికారం కైవసం చేసుకున్నారు.జరిగిన ఎన్నికలలో 90 శాతం ఓట్ల లెక్కింపు పూర్తి అయ్యేసరికి మొత్తం 120 స్థానాలకు గాను 65 స్థానాలలో బెంజమిన్ నెతన్యహు కుటమీ విజయం సాధించింది.

ఆయన సొంత పార్టీ లికడ్ కి 32 స్థానాలు రాగా.ఆయన కూటమిలో ఉన్న షాస్ అటిడ్ పార్టీకి 24 స్థానాలు లభించాయి.

దీంతో బెంజమిన్ నెతన్యహు అధికారం కైవసం అయింది.

Advertisement

ఈనెల 1వ తారీఖున ఇజ్రాయిల్ లో ఎన్నికలు జరిగాయి.బుధవారం సాయంత్రం నుంచి ఓట్ల లెక్కింపు ప్రారంభం అయింది.ఇదిలా ఉంటే గడిచిన నాలుగు సంవత్సరాలలో ఇజ్రాయిల్ లో ఐదోసారి ఎన్నికల జరగటం గమనార్హం.

ఈ ఎన్నికలలో బెంజమిన్ నెతన్యహు గెలవటంతో ఇజ్రాయిల్.ప్రజాస్వామ్యంలో అత్యధికసార్లు గెలిచినా ప్రధానమంత్రిగా రికార్డు సృష్టించారు.

ఇదే సమయంలో ప్రధాని మోడీ సోషల్ మీడియాలో హిబ్రూ భాషలో బెంజమిన్ నెతన్యహునీ అభినందించారు.భారత్ మరియు ఇజ్రాయిల్ మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింతగా ముందుకు తీసుకెళ్లే ప్రయత్నాలను కొనసాగించడానికి నేను ఎదురు చూస్తున్నాను అని ట్విట్టర్ లో మోడీ పోస్ట్ పెట్టారు.

సోషల్ మీడియాలో దారుణంగా ట్రోల్ అయిన స్టార్స్ ఎవరో తెలుసా..?
Advertisement

తాజా వార్తలు