అత్తకు-తల్లికు మధ్య మనస్పర్ధలు.. తల్లి పై కూతురు దారుణం..!

కన్నతల్లి( Mother ) అంటే ప్రేమ ఉండని వారు ఉండరేమో అనుకుంటే అది పొరపాటే.

సమాజంలో రోజురోజుకు జరుగుతున్న దారుణాలను చూస్తుంటే చివరికి ఎలాంటి పరిస్థితులు వస్తాయో ఊహించుకుంటేనే భయంగా ఉంటుంది.

ప్రపంచంలో ఎవరి రుణం అయిన తీర్చుకోవచ్చు కానీ తల్లి రుణం మాత్రం తీర్చుకోలేము.నవ మోసాలు మోసి, కానీ పెద్ద చేసిన కన్నతల్లిపై ఎవరైనా దారుణాలకు పాల్పడతారా అంటే ఎవరైనా తప్పని కొట్టి పడేస్తారు.

అయితే ప్రస్తుతం సమాజంలో చాలా మార్పులు చోటు చేసుకుంటున్నాయి.తల్లి వృద్యాపంలోకి రాగానే ఆస్తిపాస్తులు రాయించుకుని బయటకు గెంటేయడం లేదంటే అనాధాశ్రమాలకు పంపించడం లాంటివి జరుగుతున్నాయి.

ఇలాంటి కోవలోనే ఓ కూతురు తన తల్లిని అతికిరాతకంగా హత్య చేసింది.ఈ ఘటన కర్ణాటకలోని బెంగుళూరులో చోటుచేసుకుంది.

Advertisement

వివరాల్లోకెళితే. సోనాలి సేన్( Sonali Sen) కుటుంబం పశ్చిమ బెంగాల్ నుండి బెంగుళూరు( Bengaluru )వచ్చి మైకో లేఅవుట్ పరిధిలో ఉండే బైలేక హళ్లిలో ఉండే ఓ అపార్ట్మెంటులో నివాసం ఉంటుంది.సోనాలి ఫిజియోథెరపిస్ట్ గా పనిచేస్తోంది.

ఆ ఇంట్లో సోనాలితో పాటు ఆమె భర్త, అత్త, అమ్మ, ఓ కుమారుడు ఉంటారు.అయితే సోనాలి తల్లి బీవా పాల్ తరచూ ఏదో ఓ విషయంలో గొడవ పడుతూ ఉంటుంది.

ఇక తన తల్లికి, తన అత్తకు మధ్య జరిగే గొడవలతో సోనాలి విసిగిపోయింది.వీరిద్దరి గొడవలతో ఆ ఇంట్లో ప్రశాంతత అనేది లేదు.

తాజాగా సోమవారం కూడా సోనాలి తల్లి, సోనాలి అత్తకు మధ్య మాటల యుద్ధం జరిగింది.ఈ గొడవలో తల్లిని మందలించింది కూతురు.దీంతో తల్లి తాను చనిపోతానంటూ నిద్రమాత్రలను చేతిలో పట్టుకొని కూతురుని బెదిరించింది.

Joka : Expérience Mobile, Paiements Et Mécanismes De L’ap...
Roja Bet Review And Player Reputation (UK)

కూతురు తన తల్లి పడే గొడవలకు విసిగిపోయి కోపంతో ఆ నిద్రమాత్రలను బలవంతంగా తల్లితో మింగించింది.ఆ తర్వాత చున్నీతో తల్లి పీకకు చుట్టి హత్య చేసింది.

Advertisement

తల్లి మృతుదేహాన్ని ఒక సూట్ కేసులో కుక్కి అందులో తండ్రి ఫోటో పెట్టి ఆ సూట్ కేసును పోలీస్ స్టేషన్ తీసుకువెళ్లి లొంగిపోయింది.పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

తాజా వార్తలు