బెంగాల్ స‌ర్వే వ‌చ్చేసింది... ఆ పార్టీ గెలుపులోనే సూప‌ర్ ట్విస్ట్‌...?

మ‌రో రెండు నెల‌ల్లో ప‌శ్చిమ‌బెంగాల్‌లో అసెంబ్లీ ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి.

దేశ వ్యాప్తంగా ఎంతో మంది ఆస‌క్తితో ఎదురు చూస్తోన్న ఈ ఎన్నిక‌లు జాతీయ రాజ‌కీయాల‌ను మారుస్తున్నాయ‌ని ప్ర‌తి ఒక్కరు అంచ‌నా వేస్తున్నారు.

గ‌త పార్ల‌మెంటు ఎన్నిక‌ల్లో బీజేపీ అక్క‌డ అనూహ్యంగా విజ‌యం సాధించింది.లోక్‌స‌భ ఎన్నిక‌ల్లో బీజేపీ 18 స్థానాలు గెలుచుకుంది.

ఇక మ‌రో రెండు నెలల్లోనే రాష్ట్రంలో ఉన్న 294 స్థానాల‌కు జ‌రిగే ఎన్నిక‌ల‌పై అప్పుడే అంచ‌నాలు మొద‌లు అయ్యాయి.ఇక ఈ సారి బెంగాల్లో ఎలాగైనా అధికారంలోకి రావాల‌ని విశ్వ ప్ర‌య‌త్నాలు చేస్తోన్న బీజేపీ మ‌మ‌త‌ను గ‌ట్టిగా టార్గెట్‌గా చేసుకుంటోంది.

ప‌లువురు టీఎంసీ మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేల‌ను పార్టీలోకి లాగేసుకుంటోంది.ఈ ప‌రిణామాలు అధికార టీఎంసీలో క‌ల‌వ‌ర పాటుకు గురి చేస్తుండ‌గా.

Advertisement
Bengal Assembly Elections Survey Has Arrived Super Twist In The Victory Of That

బీజేపీలో ఎక్క‌డా లేని జోష్ నింపుతున్నాయి.మ‌రోవైపు కాంగ్రెస్ -వామ‌ప‌క్షాలు కూట‌మిగా ఏర్ప‌డి ఉనికి చాటుకునే ప్ర‌య‌త్నంలో ఉన్నాయి.

Bengal Assembly Elections Survey Has Arrived Super Twist In The Victory Of That

ఇప్ప‌టికే రెండు సార్లు ముఖ్య‌మంత్రి అయిన మ‌మ‌తా బెన‌ర్జీ ఈ సారి కూడా గెలిచి హ్యాట్రిక్ కొట్టాల‌ని చూస్తున్నారు.ఈ క్ర‌మంలోనే తాజా ఎన్నిక‌ల‌పై సీఎన్‌ఎక్స్‌, ఏబీపీ ఆనంద అనే సంస్థలు చేసిన స‌ర్వేలో 9000 మంది అభిప్రాయాలు సేక‌రించారు.ఈ స‌ర్వేలో టీఎంసీకు 146 నుంచి 156 స్థానాలు, బీజేపీకి 113-121 సీట్లు, కాంగ్రెస్‌-వామ‌ప‌క్షాల కూట‌మికి 20 నుంచి 28 స్థానాలు ద‌క్క వ‌చ్చ‌ని తేలింది.

ఇక్క‌డ ప్ర‌భుత్వ ఏర్పాటుకు కావాల్సిన మ్యాజిక్ ఫిగ‌ర్ 148.అంటే మ‌మ‌తా బెన‌ర్జీ అధికారానికి కేవ‌లం రెండు  సీట్ల దూరంలో మాత్ర‌మే ఉంది.అదే జ‌రిగితే కాంగ్రెస్ + వామ‌ప‌క్ష కూట‌మి మ‌మ‌త‌కు మ‌ద్ద‌తు ఇచ్చే అవ‌కాశాలు ఉన్నాయి.

తాజా వార్తలు