రోజూ నిద్రించే ముందు రెండు ఖర్జూరాలు తింటే..ఆ జ‌బ్బులు ప‌రార్‌!

ఖ‌ర్జూరాలు.ఎంత తియ్య‌గా, రుచిగా ఉంటాయో ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు.

పిల్ల‌లు, పెద్ద‌లు అనే తేడా లేకుండా అంద‌రూ ఇష్టంగా తినే ఖ‌ర్జూరాల ధ‌ర కాస్త ఎక్కువే.

అయిన‌ప్ప‌టికీ వీటిల్లో పోష‌కాలు కూడా మెండుగా ఉంటాయి.

ఐర‌న్‌, మెగ్నీషియం, కాపర్, సెలీనియం, విట‌మిన్ ఎ, విట‌మిన్ బి, విట‌మిన్ సి, ఫ్లేవనాయిడ్లు, యాంటీఆక్సిడెంట్లు ఇలా అనేక పోష‌క విల‌వ‌లు ఖ‌ర్జూరాల్లో నిండి ఉంటాయి.అందుకే ఖ‌ర్జూరాలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయ‌ని నిపుణులు చెబుతంటారు.

అయితే ఖ‌ర్జూరం వ‌ల్ల వ‌చ్చే ప్ర‌యోజ‌నాలు వాటిని తీసుకునే స‌మ‌యంపైన కూడా ఆధార‌ప‌డి ఉంటాయి.ముఖ్యంగా రాత్రి నిద్రించే ముందు రెండు చ‌ప్పున ప్ర‌తి రోజు ఖ‌ర్జూరాలు తీసుకుంటే ఎన్నో జ‌బ్బుల‌ను నివారించుకోవ‌చ్చు.

Advertisement

మ‌ల‌బ‌ద్ధ‌కం ఎంద‌రినో వేధించే స‌మ‌స్య ఇది.అయితే నిద్రించే ముందు రెండు ఖ‌ర్జూరాల‌ను తీసుకుంటే.ఆహారం త్వ‌ర‌గా జీర్ణం అవుతుంది దాంతో మ‌ల‌బ‌ద్ధ‌కం స‌మ‌స్య దూరం అవుతుంది.

అలాగే ఇటీవ‌లె కాలంలో చాలా మందిని నిద్ర లేమి స‌మ‌స్య ప‌ట్టి పీడిస్తోంది. ఒత్తిడి, ఆందోళ‌న‌, ఎక్కువ స‌మ‌యం పాటు స్మార్ట్ ఫోన్లు, టీవీలు చూయ‌డం వ‌ల్ల నిద్ర లేమి ఎక్కువ‌గా ఏర్ప‌డుతుంది.అయితే ప‌డుకునే ముందు ఖ‌ర్జూరాలు తీసుకుంటే.

ఒత్తిడి, ఆందోళ‌న దూర‌మై మాన‌సిక ప్ర‌శాంత‌త ల‌భిస్తుంది దాంతో హాయిగా నిద్ర ప‌డుతుంది.రెగ్యుల‌ర్‌గా నిద్రించే ముందు రెండు ఖ‌ర్జూరాలు తీసుకుంటే ఒంట్లో పేరుకుపోయిన అద‌న‌పు కొవ్వు క‌రుగుతుంది.

దాంతో వెయిట్ లాస్ అవుతారు.ఇక జుట్టు రాలిపోతుంద‌ని, ముఖంలో కాంతి త‌గ్గుంద‌ని బాధ ప‌డే వారు ఎంద‌రో ఉన్నారు.

ఆ దేశంలో మహేష్ రాజమౌళి కాంబో మూవీ షూటింగ్.. హీరోయిన్ ను మార్చాలంటూ?
రాష్ట్రపతి ముర్ము విందుకు వచ్చిన ఇండోనేషియన్లు ఏం చేశారో చూడండి.. వీడియో వైరల్..

అయితే ప్ర‌తి రోజు నిద్రించే ముందు రెండు ఖ‌ర్జూరాలు తీసుకుంటే హెయిర్ ఫాల్ స‌మ‌స్య త‌గ్గుతుంది.అలాగే చ‌ర్మం ఎల్ల‌ప్పుడూ య‌వ్వ‌నంగా మ‌రియు కాంతివంతంగా ఉంటుంది.

Advertisement

తాజా వార్తలు