శంఖం అందించే అద్భుత ప్రయోజనాల గురించి మీకు తెలుసా?

శంఖంను మీరు ఎప్పుడో ఒకప్పుడు చూసే ఉంటారు.మహాభారత యుద్ధంలో యుద్ధ ప్రకటనకు ముందు శంఖాన్ని పూరించిన సంగతి మనం వినేవుంటాం.

సనాతన సంప్రదాయాలలో శంఖం మంగళకరమైనదిగా పరిగణిస్తారు.ఇది దేవాలయాలలో లేదా కొద్దిమంది ఇళ్లలో కూడా ఉంటుంది.

పూజ సమయంలో లేదా ఏదైనా శుభ కార్యం జరిగే సందర్భంలో శంఖం పూరిస్తారు.పలు దేవాలయాలలో, ఉదయం, సాయంత్రం వేళల్లో శంఖం పూరించడం ఆచారం.

రోజూ శంఖం పూరిస్తే ఎంతో ప్రయోజనం కలుగుతుంది.ఆరోగ్యాన్ని అందించే అనేక అద్భుత ప్రయోజనాలు దీనిలో ఉన్నాయి.అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం.1.రోజూ శంఖం పూరించడం వల్ల పురీషనాళంలోని కండరాలు బలంగా తయారవుతాయి.శంఖునాద ప్రభావం మూత్ర నాళం, మూత్రాశయం, పొత్తికడుపు, డయాఫ్రాగమ్, ఛాతీ, మెడ కండరాలపై చాలా ప్రభావవంతంగా ఉంటుంది.2.శంఖాన్ని ఊదడం ద్వారా శ్వాస సామర్థ్యం మెరుగుపడుతుంది.ఇది థైరాయిడ్ గ్రంథులకు, స్వరపేటికకు వ్యాయామం లాంటిది.ఇది నోటికి సంబంధించిన సమస్యలను నయం చేయడంలో సహాయపడుతుంది.3.శంఖం పూరించడం ద్వారా ముఖంపై ఏర్పడే ముడతల సమస్య కూడా తగ్గుతుంది.శంఖం ఊదినప్పుడు ముఖ కండరాలు సాగుతాయి.ఇది ముఖంపై ముడతలను తగ్గిస్తుంది.4.శంఖంలో వంద శాతం కాల్షియం ఉంటుంది.రాత్రిపూట శంఖంలో నీరు పోసి.ఆ నీటితో ఉదయం చర్మంపై మసాజ్ చేయడం ద్వరా చర్మ సమస్యలు నయమవుతాయి.5.శంఖం ఊదడం వల్ల మానసిన ఒత్తిడి దూరమవుతుంది.ఒత్తిడికి లోనైన వారు తప్పనిసరిగా శంఖాన్ని పూరించాలి.

Advertisement

ఎందుకంటే శంఖం ఊదడం వల్ల అన్ని రుగ్మతలు మనస్సు నుండి దూరమవుతాయి.శంఖం ఊదడం వల్ల ఇంట్లోకి వచ్చే ప్రతికూల శక్తులు కూడా దూరంగా ఉంటాయి.

శంఖాన్ని ఇల్లాలు పూరిస్తే అక్కడి నుంచి ప్రతికూలతలు తొలగిపోతాయి.

Advertisement

తాజా వార్తలు