బెల్లకొండ హీరోని తొక్కేసే ప్రయత్నం ఎవరు చేసారు

టాలీవుడ్ లో బడా నిర్మాత బెల్లంకొండ సురేష్ తనయుడుగా ఎంట్రీ ఇచ్చి తండ్రి సపోర్ట్ తో మొదటి సినిమా నుంచే కమర్షియల్ హీరోగా నిలబడటానికి విశ్వప్రయత్నాలు చేస్తున్న హీరో బెల్లంకొండ శ్రీనివాస్.

మొదటి సినిమానే స్టార్ దర్శకుడుతో చేసిన బెల్లంకొండ శ్రీనివాస్ ఇప్పటి వరకు కెరియర్ లో ఎనిమిది సినిమాలు చేసాడు.

అయితే వీటిలో రాక్షసుడు సినిమా వరకు ఒక్క హిట్ లేకుండా వస్తున్నాడు.వరుసగా ఫ్లాప్ లు వస్తున్నా అతను మాత్రం కమర్షియల్ హీరోగా నిలబడటానికి విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాడు.

తండ్రి సపోర్ట్ ఉండటం వలన నిర్మాతలు కూడా అతని మీద భారీగానే పెట్టుబడులు పెడుతున్నారు.ఇక బోయపాటి దర్శకత్వంలో వచ్చిన జయజానకి నాయకా సినిమా హిట్ టాక్ తెచ్చుకున్న ఓవర్ బడ్జెట్ కారణంగా నిర్మాతలకి నష్టం తెచ్చింది.

ఇదిలా ఉంటే తాజాగా రాక్షసుడు సినిమాతో బెల్లంకొండ శ్రీనివాస్ ప్రేక్షకుల ముందుకి వచ్చాడు.ఇది మార్నింగ్ షో నుంచే హిట్ టాక్ తెచ్చుకుంటుంది.

Advertisement

ఇదిలా ఉంటే ఈ సినిమా ప్రమోషన్ లో భాగంగా ఈ హీరో ఆసక్తికర వాఖ్యలు చేసాడు.తనని ఇండస్ట్రీలో ఎదగకుండా చేసేందుకు చాలా మంది ప్రయత్నాలు చేసారు.

వారు తనని తొక్కే ప్రయత్నం చేస్తున్న ప్రతి సారి నేను మరింత స్పీడ్ గా ఎదుగుతున్నా అని చెప్పుకొచ్చాడు.తన సినిమా టైంలో కొంత మంది నాకు థియేటర్స్ కూడా దొరకకుండా అడ్డు పడ్డారని, అయితే ఆ సినిమా తన కెరియర్ లో సూపర్ హిట్ టాక్ తెచ్చుకుందని చెప్పుకొచ్చాడు.

తనని తొక్కేసే ప్రయత్నం చేసిన వాళ్ళు ఎవరో తనకి తెలిసిన ఆ పేర్లు ఇప్పుడు చెప్పలేనని చెప్పుకొచ్చాడు.మరి బెల్లంకొండ శ్రీనివాస్ ఇప్పుడు ఉన్నపళంగా తనని ఇండస్ట్రీలో అడ్డుకునే ప్రయత్నం జరిగింది అనే చెప్పడం వెనుక అసలు ఆంతర్యం ఏమిటి అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

తెలుగు రాశి ఫలాలు, పంచాంగం - డిసెంబర్ 21 బుధవారం 2022
Advertisement

తాజా వార్తలు