స్వాతిముత్యం వెనక ఆయన ఉన్నారు..!

బెల్లంకొండ గణేష్ హీరోగా వర్ష బొల్లమ్మ హీరోయిన్ గా నటించిన సినిమా స్వాతిముత్యం.

సితార ఎంటర్టైన్ మెంట్స్ బ్యానర్ లో తెరకెక్కిన ఈ సినిమా దసరా సందర్భంగా రిలీజ్ అవుతుంది.

పోటీగా రెండు పెద్ద హీరోల సినిమాలు వస్తున్నా సరే తగ్గేదేలే అన్నట్టుగా స్వాతిముత్యం టీం వస్తుంది.అయితే ఈ సినిమాకు ఇంత ధైర్యం ఎక్కడ నుంచి వచ్చింది అంటే.

అది గురూజీ త్రివిక్రం వల్లే అని అంటున్నారు.స్వాతిముత్యం సినిమా దసరా రేసులో ఉండటానికి అసలు కారణం త్రివిక్రం అని అంటున్నారు.

హారిక హాసిని, సితార బ్యానర్ రెండు త్రివిక్రం సొంత బ్యానర్ ల లెక్క.అందుకే ఆ బ్యానర్ లో ఏ సినిమా వచ్చినా సరే త్రివిక్రం ఇన్వాల్వ్ మెంట్ ఉంటుంది.స్వాతిముత్యం సినిమా వెనక కూడా త్రివిక్రం హ్యాండ్ ఉందని తెలుస్తుంది.

Advertisement

సినిమా స్క్రిప్ట్ నుంచి అవుట్ పుట్ వరకు త్రివిక్రం కూడా సపోర్ట్ గా ఉన్నారట.అందుకే ఈ సినిమాకు అంత బజ్ ఏర్పడిందని తెలుస్తుంది.

అంతేకాదు సినిమా పండుగకి రిలీజైతే ఆ సినిమాల టికెట్స్ దొరక్కపోతే దీనికి వస్తారని ప్లాన్ చేశారట.మొత్తానికి స్వాతిముత్యం సినిమా ప్రేక్షకులను ఇంప్రెస్ చేస్తుంది.

ట్రైలర్ ఆసక్తికరంగా ఉంది కాబట్టి సినిమాని ప్రేక్షకులు కూడా ఆదరిస్తారని చెప్పొచ్చు.

జలుబు,దగ్గు, ముక్కు ఇన్ఫెక్షన్స్ ని ఇలా కంట్రోల్ చేయండి
Advertisement

తాజా వార్తలు