చర్మానికి పోషణ అందించే బీట్ రూట్ ఫేస్ పాక్స్

బీట్ రూట్ లో యాంటీ ఆక్సిడెంట్స్ సమృద్ధిగా ఉండుట వలన చర్మానికి హాని కలిగించే ఫ్రీ రాడికల్స్ నుండి చర్మాన్ని రక్షిస్తుంది.

బీట్ రూట్ ని చర్మ సంరక్షణలో ఎలా ఉపయోగించాలో వివరంగా తెలుసుకుందాం.

బీట్ రూట్ లో ఇతర పదార్ధాలను కలిపి పాక్స్ తయారుచేసుకోవాలి.ఇప్పుడు వాటి గురించి వివరంగా తెలుసుకుందాం.

ఒక స్పూన్ బీట్ రూట్ రసంలో ఒక స్పూన్ నిమ్మరసం కలిపి ముఖానికి పట్టించి 15 నిమిషాల తర్వాత చల్లని నీటితో శుభ్రం చేసుకోవాలి.ఇలా వారంలో రెండు సార్లు చేస్తూ ఉంటే మంచి ఫలితం కనపడుతుంది.

రెండు స్పూన్ల బీట్ రూట్ రసంలో ఒక స్పూన్ కలబంద గుజ్జు కలిపి ముఖానికి పట్టించి అరగంట తర్వాత చల్లని నీటితో శుభ్రం చేసుకోవాలి.ఈ విధంగా వారానికి ఒకసారి చేస్తూ ఉంటే చర్మానికి పోషణ కలగటమే కాకుండా మంచి ఛాయ కూడా వస్తుంది.

Advertisement

రెండు స్పూన్ల బీట్ రూట్ రసంలో అర స్పూన్ బియ్యం పిండిని కలిపి ముఖానికి పట్టించి ఆరాక చల్లని నీటితో శుభ్రం చేసుకోవాలి.ఈ విధంగా వారానికి ఒకసారి చేస్తూ ఉంటే మృత కణాలు తొలగిపోవటమే కాకుండా చర్మానికి పోషణ లభిస్తుంది.ఒక స్పూన్ బీట్ రూట్ రసంలో రెండు స్పూన్ల తేనే కలిపి ముఖానికి పట్టించి 15 నిముషాలు అయ్యాక గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి.

ఈ విధంగా వారానికి రెండు సార్లు చేస్తూ ఉంటే చర్మానికి పోషణ కలగటమే కాకుండా చర్మ ఛాయ మెరుగు పడుతుంది.

Advertisement

తాజా వార్తలు