వీరికి దక్కని పదవి .. వర్మకే ఎందుకంటే ? 

మూడోసారి ప్రధానిగా నరేంద్ర మోది( Narendra Modi ) ప్రమాణ స్వీకారం చేశారు.మోది క్యాబినెట్ లో మంత్రులుగా ఎంపికైన వారు ప్రమాణ స్వీకారం చేశారు.

ఎన్డీఏ కూటమిలోని మిత్రపక్షలకు సమ ప్రాధాన్యం ఇస్తూ మంత్రివర్గాన్ని ఏర్పాటు చేశారు.ఇక ఏపీ నుంచి చూసుకుంటే నరసాపురం బిజెపి ఎంపీ భూపతి రాజు శ్రీనివాస్ వర్మ( MP Bhupathi Raju Srinivas Verma ), శ్రీకాకుళం ఎంపీ కింజరాపు రామ్మోహన్ నాయుడు( MP Kinjarapu Rammohan Naidu ), గుంటూరు ఎంపీ పెమ్మసాని చంద్రశేఖర్ లకు మంత్రి పదవులు దక్కాయి.

అయితే బిజెపి అధికారంలోకి వస్తే ఖచ్చితంగా కేంద్ర మంత్రులు అవుతారు అనుకున్న సీఎం రమేష్ ,ఏపీ బీజేపీ అధ్యక్షురాలు దగ్గుపాటి పురందరేశ్వరి కి ఇప్పుడు అవకాశం దక్కలేదు.దీంతో మంత్రి పదవుల విషయంలో చాలా లెక్కలేసుకుని మరి పదవులు ఇచ్చారనే విషయం అర్థమవుతుంది.

ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురంధరేశ్వరి కి క్యాబినెట్ ర్యాంక్ దక్కుతుందని అంచనా వేశారు.

Advertisement

కానీ టిడిపి ( TDP )తో పొత్తు కారణంగా ఆ పార్టీకి క్యాబినెట్ ర్యాంక్ కేటాయించాల్సి రావడంతో , యువ ఎంపీ రామ్మోహన్ నాయుడుకు దానిని కేటాయించారు.ఒకే రాష్ట్రానికి రెండు క్యాబినెట్ లు ఇచ్చే అవకాశం లేకపోవడంతో  పురంధరేశ్వరి కి అవకాశం దక్కలేదు.గతంలో క్యాబినెట్ ర్యాంక్ మంత్రిగా సుదీర్ఘకాలం పనిచేసిన అనుభవం పురంధరేశ్వరి కి ఉంది.

అయితే ఇప్పుడు ఆమెకు సహాయ మంత్రి ఇస్తే ఆమె ప్రభావం తగ్గించినట్లే అవుతుందని , ఆమెను పరిగణలోకి తీసుకున్నట్టుగా తెలుస్తోంది .ఇక సీఎం రమేష్( CM Ramesh ) టిడిపి నుంచి బిజెపిలో చేరారు.మోదీ , అమిత్ షాలకు అత్యంత సన్నిహితమైన వ్యక్తిగానూ ముద్ర ఆయనపై ఉంది.

అయితే మంత్రి పదవి విషయంలో ఆయన పేరును పరిగణలోకి తీసుకోక పోవడానికి కారణం.ఆయనపై ఇప్పటికీ టిడిపి ముద్ర ఉండడమే.

నరసాపురం ఎంపీ భూపతి రాజు శ్రీనివాస్ వర్మకు మంత్రి పదవి వెనక కారణాలు చాలానే కనిపిస్తున్నాయి.మొదటి నుంచి బిజెపిలోనే ఉన్న శ్రీనివాస్ వర్మ కు పదవి ఇవ్వడం ద్వారా , పార్టీని నమ్ముకున్న కిందిస్థాయి కార్యకర్తలకు భరోసా కల్పించేందుకు శ్రీనివాస్ వర్మ కు అవకాశం ఇచ్చినట్లుగా అర్థమవుతుంది .అంతేకాకుండా ఆర్ఎస్ఎస్ నుంచి ఒత్తిడి ఉండడంతో శ్రీనివాస్ వర్మకు అవకాశం దక్కిందట.

'హెలికాప్టర్ ' కోసం ఇంత పంచాయతీ జరుగుతోందా ? 
Advertisement

తాజా వార్తలు