చెత్తబుట్టలో పడేసేవాటితో బ్యూటీ ఫ్యాక్స్.

మనం ఏవైతే పనికిరావు అని చెత్తబుట్టలో వేస్తామో అవే సౌందర్య సాధనాలుగా ఉపయోగపడుతాయి.నిమ్మకాయ డొప్ప.

కూరగాయాలమీద తీసేసిన తొక్కలు.టీ పెట్టిన తరవాత పడేసే టీ పొడి.

ఇలా కాదేదీ బ్యూటీ కి అనర్హం.మరి ఎలాగో మీరు చుడండి.

టీ తయారుచేసిన తరువాత మిగిలిన టీ పిప్పిని బయటపడేయకండి.ఆ పిప్పిని కొంచెంసేపు ఫ్రిజ్ లో ఉంచి తరువాత దాన్ని ఒక కాటన్ బట్టలోకి తీసుకుని కళ్ళకింద పెట్టుకుంటే నల్లని వలయాలు పోతాయి అంతేకాదు ఉబ్బెత్తుగా ఉండే కళ్ళని సమానం చేస్తాయి.

Advertisement

చర్మం మీద ఉండే మృతకణాలు పోవాలి అంటే అరటిపండు తొక్కని తీసుకుని దానిమీద కొంచం చెక్కెర చల్లి చర్మంపై రుద్దితే చాలు.అయితే మొహం జిడ్డుగా ఉన్నవాళ్లు మాత్రం ఈ చిట్కాని ఫాలో అవ్వకూడదు.

కమలాపండు తొక్కల్ని బాగా ఎండబెట్టి పొడిలా చేయాలి.ఆ పొడిలో కొంచం పసుపు.

కలిపి ఫేస్ ప్యాక్ లా ఉపయోగించవచ్చు.గుడ్డును పగలగొట్టిన తర్వాత దాని పెంకులకు అంటిపెట్టుకుని ఉండే వైట్‌ను ముఖంపై రాసుకుని కాసేపు అలాగే ఉంచుకుని నీళ్లతో శుభ్రంగా, కడిగేసుకోవాలి.

దీనివల్ల చర్మం మృదువుగా తయారవుతుంది చంకలు.ఎప్పుడు చెమట వాసన వస్తూ ఇబ్బంది పడేవాళ్ళు నిమ్మరసాన్ని చంకలో రాసి రుద్దుకుంటే మురికిపోతుంది, వాసన ఇక రాదు.

రాగి పిండితో చర్మానికి మెరుగులు.. ఇలా వాడితే మీ అందం రెట్టింపు అవ్వాల్సిందే!

అంతేకాదు నిమ్మరసాన్ని నల్లగా మారుతున్న ప్రదేశంలో రాసుకుంటే ఇక అక్కడ చర్మం నల్లపడదు.

Advertisement

తాజా వార్తలు