గ్రీన్ యాపిల్‌తో ఇలా చేస్తే.. మ‌చ్చ‌ల్లేని మెరిసే చ‌ర్మం మీసొంతం!

గ్రీన్ యాపిల్.ఆరోగ్యానికి ఎంత మేలు చేస్తుందో ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు.

గ్రీన్ యాపిల్‌లో ఎన్నో పోష‌కాలు నిండి ఉన్నాయి.

ముఖ్యంగా గ్రీన్ యాపిల్‌లో ఫైబ‌ర్ ఎక్కువ‌గా.

కేల‌రీలు త‌క్కువ‌గా ఉంటాయి.అలాగే జింక్, రాగి, ఐర‌న్‌, మాంగనీస్, పొటాషియం, ప‌లు విట‌మిన్లు మ‌రియు యాంటీ ఆక్సిడెంట్లు కూడా గ్రీన్ యాపిల్‌లో ఉంటాయి.

ఇవి ఆరోగ్యాన్ని ర‌క్షించ‌డంలోనూ.అనేక జ‌బ్బుల‌ను దూరం చేయ‌డంలోనూ అద్భుతంగా స‌హాయ‌ప‌డ‌తాయి.

Advertisement

ఇక కేవ‌లం ఆరోగ్యానికి కాదు.సౌంద‌ర్య ప‌రంగా కూడా గ్రీన్ యాపిల్ ఉప‌యోగ‌ప‌డుతుంది.

చ‌ర్మాన్ని మెరిపించ‌డంలోనూ.ముఖంపై మొటిమ‌లు, న‌ల్ల మ‌చ్చ‌లు త‌గ్గించ‌డంలోనూ.

చ‌ర్మాన్ని మృదువుగా చేయ‌డంలోనూ గ్రీన్ యాపిల్ స‌హాయ‌ప‌డుతుంది.మ‌రి ఇంత‌కీ గ్రీన్ యాపిల్‌ను చ‌ర్మానికి ఎలా ఉప‌యోగించాలి అన్న‌ది ఇప్పుడు తెలుసుకుందాం.

ముందుగా గ్రీన్ యాపిల్ లోప‌లి భాగంగా బాగా పేస్ట్ చేసుకుని.అందులో కొద్దిగా తేనె వేసి మిక్స్ చేసుకోవాలి.

విజయవాడలో బిజినెస్ అండ్ టూరిజం వీసాపై సదస్సు
ఆలు తొక్కతో ఇలా చేస్తే‌ అందంగా మెరిసిపోవ‌చ్చు!!

ఈ మిశ్ర‌మాన్ని ముఖానికి అప్లై చేసి.ఇర‌వై నిమిషాల పాటు ఆరిపోనివ్వాలి.

Advertisement

అనంత‌రం చ‌ల్ల‌టి నీటితో ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి.ఇలా వారానికి రెండు సార్లు చేస్తే.

ముఖంపై ముడ‌త‌లు, స‌న్న‌ని గీత‌లు పోయి య‌వ్వ‌నంగా మారుతుంది.

రెండొవ‌ది.గ్రీన్ యాపిల్‌ను ముక్క‌లుగా క‌ట్ చేసి పేస్ట్ చేసుకోవాలి.ఆ త‌ర్వాత అందులో కొద్దిగా దానిమ్మ ర‌సం వేసి బాగా క‌లుపుకోవాలి.

ఈ మిశ్ర‌మాన్ని ముఖానికి మ‌రియు మెడ‌కు అప్లై చేసి.అర‌గంట వ‌దిలేయాలి.

అనంత‌రం గోరు వెచ్చ‌ని నీటితో ముఖాన్ని క్లీన్ చేసుకోవాలి.ఇలా వారానికి మూడు సార్లు చేయ‌డం వ‌ల్ల ముఖంపై పెరుకుపోయిన మ‌లినాలు, మృత క‌ణాలు పోయి.

అందంగా, ప్ర‌కాశ‌వంతంగా మారుతుంది.మూడొవ‌ది.

గ్రీన్ యాపిల్ లోప‌లి భాగంగా పేస్ట్ చేసుకుని ర‌సం తీసుకోవాలి.ఆ రసంలో కొద్దిగా నిమ్మ‌ర‌సం యాడ్ చేసి మిక్స్ చేసుకోవాలి.

ఈ మిశ్ర‌మాన్ని ముఖానికి అప్లై చేసి.ఆరిపోనివ్వాలి.

ఆ త‌ర్వాత గోరు వెచ్చ‌ని నీటితో ముఖాన్ని శుభ్రంగా వాష్ చేసుకోవాలి.ఇలా త‌ర‌చూ చేయ‌డం వ‌ల్ల మొటిమ‌లు, న‌ల్ల మ‌చ్చ‌లు క్ర‌మంగా త‌గ్గిపోతాయి.

తాజా వార్తలు