మ‌జ్జిగ‌లో ఇవి క‌లిపి రాస్తే..మ‌చ్చ‌లు మ‌టుమాయం?

ప్ర‌స్తుత వేస‌వి కాలంలో ఎండ తీవ్ర‌త‌ను త‌ట్టుకునేందుకు, వ‌డ‌దెబ్బ నుంచి ర‌క్ష‌ణ పొందేందుకు చాలా మంది త‌ర‌చూ మ‌జ్జిగ తీసుకుంటుంటారు.మ‌జ్జిగ నీర‌సం, అల‌స‌ట, ఒత్తిడి వంటి స‌మ‌స్య‌ల‌ను దూరం చేసి శ‌రీరాన్ని చ‌ల్ల బ‌రుస్తుంది.

అందుకే మజ్జిగ ఆరోగ్యం పాలిట అమృతం లాంటిద‌ని అంటుంటారు.అయితే మ‌జ్జిగ ఆరోగ్యానికే కాదు.

చ‌ర్మ సౌంద‌ర్యానికి కూడా అద్భుతంగా స‌హాయ‌ప‌డుతుంది.మ‌రి మ‌జ్జిగ‌ను ఎలా చ‌ర్మానికి ఉప‌యోగించాలి అన్న‌ది ఇప్పుడు తెలుసుకుందాం.

సాధార‌ణంగా చాలా మంది ముఖంపై న‌ల్ల మ‌చ్చ‌ల‌తో బాధ ప‌డుతుంటారు.అయితే అలాంటి వారు మ‌జ్జిగ‌, రోజ్ వాట‌ర్ మ‌రియు చిటికెడు ప‌సుపు వేసి బాగా క‌లుపుకోవాలి.

Advertisement
Beauty Benefits Of Buttermilk! Beauty, Benefits Of Buttermilk, Buttermilk For Sk

ఈ మిశ్ర‌మాన్ని ముఖానికి పూత‌లా వేసుకుని ఇర‌వై లేదా ముప్పై నిమిషాల పాటు వ‌దిలేసి.ఆ త‌ర్వాత ముఖాన్ని క్లీన్ చేసుకోవాలి.

ఇలా వారంలో రెండు సార్లు చేయ‌డం వ‌ల్ల‌.చ‌ర్మంపై న‌ల్ల మ‌చ్చ‌లు మ‌టుమాయం అవుతాయి.

Beauty Benefits Of Buttermilk Beauty, Benefits Of Buttermilk, Buttermilk For Sk

ఈ వేస‌వి కాలంలో ఎండ‌ల కార‌ణంగా ముఖం త‌ర‌చూ ఎర్ర‌గా క‌మిలి పోతుంటుంది.అయితే మ‌జ్జిగ‌లో ట‌మాటా గుజ్జు వేసి బాగా మిక్స్ చేయాలి.ఈ మిశ్ర‌మాన్ని ముఖానికి అప్లై చేసి.

ఇరవై నిమిషాలు పాటు ఆర‌నివ్వాలి.ఆ త‌ర్వాత చ‌ల్ల‌టి నీటితో ముఖాన్ని శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి.

వారంలో 2 సార్లు ఈ రెమెడీని ట్రై చేస్తే మెడ న‌లుపు మాయం!

ఇలా త‌ర‌చూ చేయ‌డం వ‌ల్ల ఎండకు క‌మిలిన చ‌ర్మం మ‌ళ్లీ సాధార‌ణ స్థితికి చేరుకుంటుంది.అలాగే చాలా మంది స్కిన్ వైటెనింగ్ కోసం ర‌క‌ర‌కాల క్రీములు వాడుతుంటారు.

Advertisement

అయితే ఒక బౌల్‌లో మ‌జ్జిగ‌, ముల్తానీ మ‌ట్టి, తేనె వేసి బాగా మిక్స్ చేసుకోవాలి.ఈ మిశ్ర‌మాన్ని ముఖానికి ప్యాక్‌లా వేసుకుని.

పావు గంట పాటు వ‌దిలేయాలి.ఆ త‌ర్వాత గోరు వెచ్చ‌ని నీటితో ఫేష్ వాష్ చేసుకోవాలి.

ఇలా వారంలో రెండు లేదా మూడు సార్లు చేస్తే స్కిన్ వైట్‌గా మారుతుంది.

తాజా వార్తలు