మహేష్ న్యూ లుక్ చూసారా.. బీస్ట్ మోడ్ లో సూపర్ స్టార్!

సూపర్ స్టార్ మహేష్ బాబు 47 ఏళ్ళు దాటినా ఇప్పటికి కూడా యంగ్ హీరోలకు పోటీగా నిలుస్తూ అందంలో ఏమాత్రం తీసిపోకుండా మైంటైన్ చేస్తున్నాడు.

యువతను తన అందంతో మెస్మరైజ్ చేస్తూ సూపర్ స్టార్ గా వెలుగొందు తున్నాడు.

గత కొద్దీ రోజులుగా మహేష్ బాబు న్యూ లుక్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఫ్యాన్స్ ను సర్ప్రైజ్ చేస్తున్నాయి.తాజాగా మహేష్ బాబు మరో న్యూ లుక్ నెట్టింట వైరల్ అవుతుంది.

గత ఏడాది మహేష్ బాబు సర్కారు వారి పాట సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే.ఈ సినిమా తర్వాత ప్రెజెంట్ మహేష్, త్రివిక్రమ్ కాంబోలో SSMB28 సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే.

ఈ సినిమాను హారిక హాసిని బ్యానర్ పై ఎస్ రాధాకృష్ణ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు.ఇక ఈ సినిమాకు థమన్ సంగీతం అందిస్తుండగా.

Advertisement
Beast Mode On For Mahesh Babu Details, Mahesh Babu, SSMB28, Trivikram Srinivas,

పూజా హెగ్డే, శ్రీలీల హీరోయిన్లుగా నటిస్తున్నారు.

Beast Mode On For Mahesh Babu Details, Mahesh Babu, Ssmb28, Trivikram Srinivas,

ప్రస్తుతం ఈ సినిమా శరవేగంగా షూటింగ్ జరుపు కుంటున్న ఈ సినిమాను మహేష్ బాబు కెరీర్ లోనే బిగ్గెస్ట్ యాక్షన్ సినిమాగా త్రివిక్రమ్ ప్లాన్ చేయడంతో ఈ సినిమా కోసం మహేష్ చాలా కష్ట పడుతున్నాడు.కొత్త గెటప్స్ తో కనిపించడానికి శ్రమిస్తున్నాడు.తాజాగా ఈ సినిమా కోసం సూపర్ స్టార్ మహేష్ అగ్రెసివ్ లుక్ లోకి మారారు.

ఇప్పటికే తన హెయిర్ స్టైల్ ను పూర్తిగా మార్చేయగా.ఇప్పుడు తన బాడీ లుక్ ను కూడా మార్చే పనిలో ఉన్నట్టు తెలుస్తుంది.

Beast Mode On For Mahesh Babu Details, Mahesh Babu, Ssmb28, Trivikram Srinivas,

తాజాగా మహేష్ నుండి వచ్చిన కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.జిమ్ లో వర్కౌట్స్ చేస్తూ మహేష్ బాబు తన బీస్ట్ మోడ్ ను చూపించి అందరికి షాక్ ఇచ్చారు.ఇలా ఈ సినిమా కోసం మహేష్ ఎంత కష్టపడుతున్నాడు అనేది అర్ధం అవుతుంది.

వారంలో 2 సార్లు ఈ రెమెడీని ట్రై చేస్తే మెడ న‌లుపు మాయం!

ఈ పిక్స్ చుసిన సూపర్ స్టార్ ఫ్యాన్స్ మహేష్ ను ఈ సినిమాలో నెక్స్ట్ లెవల్లో చూడబోతున్నాం అని తెగ సంతోష పడుతున్నారు.

Advertisement

తాజా వార్తలు