బీజేపీ అధికారంలోకి వస్తే బీసీకి సీఎం పదవి..: అమిత్ షా

సూర్యాపేటలో బీజేపీ జనగర్జన సభకు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా హాజరయ్యారు.

ఈ సందర్భంగా అమిత్ షా మాట్లాడుతూ బీజేపీతోనే తెలంగాణలో అభివృద్ధి సాధ్యమని తెలిపారు.

కాంగ్రెస్, బీఆర్ఎస్ కుటుంబ పార్టీలని అమిత్ షా అన్నారు.బీఆర్ఎస్ పేదల వ్యతిరేక పార్టీ అన్న ఆయన కేటీఆర్ ను సీఎం చేయడమే కేసీఆర్ లక్ష్యమని పేర్కొన్నారు.

దళితులను సీఎం చేస్తానని కేసీఆర్ మోసం చేశారని మండిపడ్డారు.అయితే ఈసారైనా దళితుడిని సీఎం చేస్తారా అని ప్రశ్నించారు.

అలాగే బీసీల సంక్షేమం కోసం కేసీఆర్ చేసిందేమీ లేదన్న అమిత్ షా బీజేపీ అధికారంలోకి వస్తే బీసీకి సీఎం పదవి ఇస్తామని హామీ ఇచ్చారు.

Advertisement
శ్రీవారి ఆలయంలో శ్రీలీల బుగ్గగిల్లిన తమన్... ఆలయంలో ఈ పనేంటంటూ ట్రోల్స్?

తాజా వార్తలు