సిద్దిపేట కుర్రాడు అభయ్ ఎలిమినేట్ అయిన సంగతి విదితమే.
సరిగ్గా ఆడక, ఏకంగా బిగ్‌బాస్ ను బొక్కా, మైండ్‌లెస్ అని బూతులు తిట్టడంతో అభయ్ జాతకం తలకిందులైంది.
సొంత టీం వాళ్లు తన్నుకుంటుంటే నవ్వుకుంటూ పక్కన కూర్చునేవాడు.ఇప్పుడంటే ఇప్పుడే బయటికి పోతా! అని సవాళ్లు విసిరేవాడు.
కట్ చేస్తే, నాగార్జున ( Nagarjuna )స్వయంగా రంగంలోకి దిగి మరీ రెడ్ కార్డు చూపించి వెళ్లిపో! అన్న పరిస్థితికి వచ్చాడు.దాంతో గర్వం దిగొచ్చి.బాబ్బాబు, ఇంకో చాన్స్ ఇవ్వండి! అని బతిమిలాడే పరిస్థితికి దిగజారడం ఎందుకు? మిగతా హౌజ్ మేట్లు జాలిపడి నాగార్జునని బతిమాలగా కొన్ని రోజులు కొనసాగాడు కానీ ఎప్పుడో ఎలిమినేటి అయ్యి ఉండేవాడు!
ఈ నేపథ్యంలోనే చివరలో హోస్ట్ నాగార్జున ఓ మాటన్నాడు గుర్తుందా? నిఖిల్( Nikhil ), నిన్ను బీట్ చేసే వాడెవడొస్తాడో చూద్దాం అని? గుర్తుందా? అవును, త్వరలో రంగంలోకి రోహిణి, అవినాష్, హరితేజ( Rohini, Avinash, Hariteja ) రానున్నారు.ఎంట్రీ షూట్ పూర్తికాగా వారు త్వరలో అడుగుపెట్టబోతున్నారని విశ్వసనీయ వర్గాల సమాచారం.అంటూ నాగ్ క్లూ ఇచ్చిన సంగతి అందరికీ తెలిసే ఉంటుంది.
ప్రస్తుతం హౌజులో ఉన్న మెంటల్ కేసులకు వారే విరుగుళ్లు! అంటూ కూడా నాగ్ చెప్పుకొచ్చాడు.దాంతో బిగ్ బాస్ వీక్షకులు ఇక వారు ఎంట్రీ ఇస్తే.
మాకు ఎర్రగడ్డ బాధ తప్పుతుంది అని సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తూ తమతమ అభిప్రాయాలను చెప్పుకొస్తున్నారు.
ఇకపోతే సిద్దిపేట పోరగాడినని ప్రతిసారీ చెప్పుకున్న కంటెస్టెంట్ అభయ్ కి మామ్ములు వ్యతిరేకత రాలేదు! మరీ ముఖ్యంగా తెలంగాణ బిగ్ బాస్ అభిమానులు అయితే, "ఓ సిద్దిపేట పోరడు సిగ్గుపడడు, మరో రెండు ఎపిసోడ్లకు బిచ్చం ఎత్తుకోవడం ఏందిరా భయ్? ఆఖరికి విష్ణు ప్రియకన్నా అధ్వానం అయిపోతివి? చెత్త గేమ్ ఆడినవ్? అసలు విష్ణుప్రియ బుర్రే కోడి బుర్ర అనుకుంటే, సేమ్ బుర్రతో నువ్వెలా అడినవ్ రా భయ్!" అంటూ సోషల్ మీడియాలో తమ గోడుని వినిపిస్తున్నారు.కాగా బిగ్ బాస్ రాబోయే సీజన్లు మరింత రసవత్తరంగా సాగబోతున్నట్టు గుసగుసలు వినబడుతున్నాయి.ఇప్పటిదాకా టెలికాస్ట్ అయిన షోలలో అన్ని షోస్ కంటే కూడా బిగ్ బాస్ సీజన్ 8 ముందంజలో దూసుకుపోతున్నట్టు వార్తలు వస్తున్నాయి.
ఇక త్వరలో వైల్డ్ కార్డు ఎంట్రీల ద్వారా ఎంట్రీ ఇవ్వబోతున్న రోహిణి, అవినాష్, హరితేజల గురించే ఇపుడు సర్వత్రా చర్చ నడుస్తోంది!.
తాజా వార్తలు
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy