బిగ్ బాస్ కంటెస్టెంట్స్ లిస్టులో నా పేరు ఉంది.. బర్రెలక్క కామెంట్స్ వైరల్!

బిగ్ బాస్ సీజన్ 8 ( Bigg Boss 8 ) కార్యక్రమం త్వరలోనే ప్రసారం కాబోతున్న నేపథ్యంలో ఈ కార్యక్రమానికి సంబంధించి ఎన్నో రకాల వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ఇలా బిగ్ బాస్ కార్యక్రమంలో భాగంగా పలువురు కంటెస్టెంట్లు పాల్గొనబోతున్నారంటూ పలువురు సెలబ్రిటీలు అలాగే సోషల్ మీడియా స్టార్స్ పేర్లు వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే.

ఇలా ఈ కార్యక్రమంలో పాల్గొనబోతున్నారు అంటూ వస్తున్నటువంటి వార్తలలో బర్రెలక్క( Barrelakka )పేరు కూడా మారుమోగిపోయింది.

Barrelakka Gives Clarity On Bigg Boss Entry , Barrelakka,bigg Boss 8,contestant

ఈ కార్యక్రమంలో కంటెస్టెంట్ గా బర్రెలక్క అలియాస్ శిరీష పాల్గొనబోతున్నారని వార్తలు వచ్చాయి.ఇక ఈమె అందరికీ సుపరిచితమే తను డిగ్రీ చదివిన ఉద్యోగం రాలేదని అందుకే బర్రెలు కాస్తున్నాను అంటూ ఒక వీడియోని షేర్ చేయడంతో ఇది కాస్త వైరల్ గా మారింది.అనంతరం ఈమె నిరుద్యోగుల కోసం పోరాటం చేస్తూ తెలంగాణలో జరిగిన అసెంబ్లీ అలాగే పార్లమెంట్ ఎన్నికలలో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తూ మరింత  క్రేజ్ సొంతం చేసుకున్నారు.

Barrelakka Gives Clarity On Bigg Boss Entry , Barrelakka,bigg Boss 8,contestant

ఇలా ఎంతో పాపులారిటీ సొంతం చేసుకున్న బర్రెలక్క హౌస్ లోకి వస్తుంది అంటూ వార్తలు వచ్చాయి.అయితే ఈ వార్తలు గురించి తాజాగా ఈమె స్పందించారు.తన పేరు బిగ్ బాస్ కంటెస్టెంట్ల లిస్టులో ఉందని తనకు కూడా సమాచారం వచ్చింది.

Advertisement
Barrelakka Gives Clarity On Bigg Boss Entry , Barrelakka,Bigg Boss 8,Contestant

అయితే నాకు ప్రస్తుతం కాస్త ఫేమ్ తగ్గిపోవడంతో నా పేరును తొలగించినట్లు నాకు సమాచారం అందిందని తెలిపారు.ఇటీవల కాలంలో మన ప్రాణాలే శాశ్వతం కాదు.ఇక ఫేమ్ శాశ్వతం కాదు.

పెద్ద పెద్ద సినిమాలే థియేటర్లలో వంద రోజులు ఆడుతున్నాయి.అయినా బిగ్ బాస్ లోకి వెళ్ళనందుకు నాకు ఎలాంటి నష్టమూ లేదు కాకపోతే నన్ను అభిమానించేవారు అలాగే నా శ్రేయోభిలాషులకు ఈ విషయం పట్ల క్లారిటీ ఇవ్వాలన్న ఉద్దేశంతోనే తెలియజేస్తున్నానని ఈమె బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్లడం లేదు అంటూ క్లారిటీ ఇచ్చారు.

Advertisement

తాజా వార్తలు