మ‌ల‌బ‌ద్ధ‌కంతో బాధ‌ప‌డుతున్నారా? అయితే ఈ జావ తాగాల్సిందే!

మ‌ల‌బ‌ద్ధకం పిల్ల‌లు, పెద్ద‌లు అనే తేడా లేకుండా చాలా మందిలో స‌ర్వ సాధార‌ణంగా క‌నిపించే స‌మ‌స్య ఇది.

ఆహార‌పు అల‌వాట్లు, జీవ‌న శైలిలో మార్పులు, ప‌లు ర‌కాల మందుల వాడ‌కం, ఫైబ‌ర్‌ను స‌రిగ్గా తీసుకోక‌పోవ‌డం, థైరాయిడ్‌, ప్రెగ్నెన్సీ ఇలా ర‌క‌ర‌కాల కార‌ణాల వ‌ల్ల మ‌ల‌బ‌ద్ధ‌కం స‌మ‌స్య వేధిస్తూ ఉంటుంది.

ఇది చిన్న స‌మ‌స్యే అయిన‌ప్ప‌టికీ.నిర్ల‌క్ష్యం చేస్తే మాత్రం తీవ్ర త‌రంగా మారి అనేక ఇబ్బందుల‌కు గురి చేస్తుంది.

అందుకే మ‌ల‌బ‌ద్ధ‌క స‌మ‌స్య‌ను దీర్ఘ‌కాలిక స‌మ‌స్య‌గా మార‌కుండా చూసుకోవాలి.అయితే అందుకు కొన్ని కొన్ని ఆహారాలు అద్భుతంగా స‌హాయ‌ప‌డ‌తాయి.

అలాంటి వాటిలో బార్లీ జావ ఒక‌టి.బార్లీ గింజ‌ల్లో విట‌మిన్ ఎ, విట‌మిన్ బి, కాల్షియం, పొటాషియం, సోడియం, జింక్, ఐర‌న్‌, పొటాషియం, మెగ్నీషియం, కాప‌ర్‌, ప్రోటీన్‌, ఫైబ‌ర్‌, యాంటీ ఆక్సిడెంట్స్‌, కార్పోహైడ్రేడ్స్ ఇలా బోలెడ‌న్ని పోష‌కాలు నిండి ఉంటాయి.అందుకే బార్లీ గింజ‌లు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి.

Advertisement

ముఖ్యంగా మ‌ల‌బ‌ద్ధ‌కంతో బాధ ప‌డే వారు.బార్లీ జావ తీసుకోవ‌డం ఎంతో ఉత్తమం.పైగా బార్లీ జావ చేయ‌డం పెద్ద క‌ష్ట‌మైన ప‌నేమి కాదు.

ముందుగా బార్తీ గింజ‌ల‌ను తీసుకుని మెత్త‌గా పొడి చేసుకోవాలి.ఇప్పుడు ఒక‌టిన్న‌ర గ్లాస్ నీటిలో రెండు స్పూన్ల బార్లీ గింజ‌లు పొడి వేసి కాస్త చిక్కబ‌డే వ‌ర‌కు మ‌రిగించాలి.

అంతే బార్లీ జావ సిద్ధ‌మైన‌ట్టే.ఈ బార్లీ జావ‌ను ప్ర‌తి రోజు ఒక గ్లాస్ చ‌ప్పున‌ తీసుకుంటే జీర్ణాశయం శుభ్రపడుతుంది.

మలబద్దకం దూరం అవుతుంది.జీర్ణ వ్య‌వ‌స్థ ప‌ని తీరు కూడా మెరుగు ప‌డుతుంది.

కీళ్ల నొప్పుల నుంచి మ‌ల‌బ‌ద్ధ‌కం నివార‌ణ వ‌ర‌కు ఆముదంతో ఎన్ని ప్ర‌యోజ‌నాలో తెలుసా?
అల్లు అర్జున్ విషయం లో లాయర్ నిరంజన్ రెడ్డి ఏం చేస్తున్నారు...

అంతేకాదు, రెగ్యుల‌ర్‌గా బార్లీ జావ సేవిస్తే వెయిట్ లాస్ అవుతాయి.ర‌క్తంలో చ‌క్కెర స్థాయిలు అదుపులో ఉంటాయి.మూత్ర పిండాల్లో రాళ్లు క‌రిగిపోతాయి.

Advertisement

నీర‌సం, అల‌స‌ట వంటి స‌మ‌స్య‌లు ప‌రార్ అవుతాయి.

తాజా వార్తలు