చాట్‌జిపిటికి పోటీగా 'బార్డ్‌' బరిలో దిగింది... యాక్సెస్‌ వాళ్లకు మాత్రమే?

మైక్రోసాఫ్ట్ చాట్‌జిపిటిని(ChatGPT, ) ఎప్పుడైతే లాంచ్‌ చేసిందో దీనికి పోటీగా హుటాహుటిన గూగుల్‌ కంపెనీ బార్డ్ చాట్‌బాట్‌ను(Google AI Chatbot ) అనౌన్స్‌ చేసింది.

ఎట్టకేలకు ఇపుడు తాజాగా బార్డ్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది.

అయితే బార్డ్‌కి లిమిటెడ్ యాక్సెస్‌ను ఓపెన్‌ చేస్తున్నట్లు గూగుల్ ప్రకటించింది.ఈ విషయమై తాజాగా కొంతమంది పిక్సెల్ వినియోగదారులకు బార్డ్‌ను టెస్ట్‌ చేయడానికి గూగుల్‌ ఆహ్వానం పంపింది.

ప్రస్తుతం యూఎస్‌, యూకేలోని పరిమిత సంఖ్యలో వినియోగదారులకు మాత్రమే బార్డ్ అందుబాటులో ఉన్నట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం.

ఈ క్రమంలో ఇతర ప్రాంతాల వారికి బార్డ్ ఎప్పుడు అందుబాదులోకి వస్తుందనే అంశంలో గూగుల్ ఇంకా స్పష్టత ఇవ్వలేదు.బార్డ్‌ ప్రాజెక్ట్ లీడ్స్ అయిన సిస్సీ హ్సియావో, ఎలి కాలిన్స్ మాట్లాడుతూ."బార్డ్‌ని టెస్ట్‌ చేయడం ద్వారా చాలా విషయాలు తెలుసుకున్నాం.

Advertisement

ఇప్పుడు వినియోగదారుల నుంచి ఫీడ్‌బ్యాక్‌ అందుకుని, మరింత మెరుగు పరచాల్సిన దశలో ఉన్నాం." అంటూ చెప్పుకొచ్చారు.

అయితే వినియోగదారులు ఇప్పుడు ప్రకటించింది బార్డ్ పబ్లిక్ రిలీజ్ కాదని గుర్తుంచుకోవాలి.బార్డ్ అందరికీ ఎప్పుడు ఓపెన్‌ అవుతుందనే అంశంపై సిస్సీ హ్సియావో, ఎలి కాలిన్స్ ఇంకా స్పష్టత ఇవ్వలేదు.

ఇకపోతే, గూగుల్‌( Google ) అనౌన్స్‌మెంట్‌లోని స్క్రీన్‌షాట్‌లలో బార్డ్ ఇంటర్‌ఫేస్ ని ఒకసారి గమనిస్తే.బింగ్‌ ఏఐకి పోలికలు ఉన్నట్టు కనిపిస్తున్నాయి.అదేవిధంగా కొన్ని రకాల వ్యత్యాసాలు కూడా ఉండడం గమనించవచ్చు.

ప్రతి రెస్పాన్స్‌ కింద.థంబ్స్ అప్, రిఫ్రెష్ యారో, థంబ్స్ డౌన్, గూగుల్ ఇట్ వంటి 4 బటన్‌లు ఉన్నాయి.

ఉదయాన్నే నీళ్లలో తేనెను కలుపుకొని తాగుతున్నారా? అయితే ఈ జాగ్రత్తలు తప్పనిసరి..

వ్యూ అదర్‌ డ్రాఫ్ట్స్‌ బటన్‌ ద్వారా వినియోగదారులు ఇతర రెస్పాన్స్‌లను ఇక్కడ చూడవచ్చు.అయితే బార్డ్‌ను మెరుగుపరచడంలో సహాయపడటానికి గూగుల్‌ తన వినియోగదారుల నుంచి ఫీడ్‌బ్యాక్‌ను సేకరించే పనిలో బిజీగా ఉన్నట్టు తెలుస్తోంది.

Advertisement

తాజా వార్తలు