మాట త‌ప్ప‌ను అంటూనే.. భారీగా బార్ లైసెన్స్ లు జారీ.. ఇచ్చిన మాట సంగ‌తేంటి మ‌రి...?

ప్ర‌తిప‌క్షంలో ఉన్న‌ప్పుడు చేసిన వాగ్దానాలు. అధికారం వ‌చ్చాక నేర‌వేర్చ‌డంలో నిర్ల‌క్ష్యం వ‌హిస్తుంటారు.

చేతికి ఎలాగూ అధికారం వ‌చ్చింద‌ని.మ్యాట‌ర్ డైవ‌ర్ట్ చేస్తుంటాయి పార్టీలు.

మ‌రిని ప‌రిస్థితుల్లో ఇప్ప‌టి వ‌ర‌కు మద్య నిషేధాన్ని అమలు చేసే దమ్ము.ధైర్యం ప్రభుత్వాల‌కు లేవ‌నే చెప్పాలి.

ఇప్పుడు ఏపీలో కూడా సీఎం జ‌గ‌న్ మాట చెప్పే మాట‌ల‌కు.అమ‌లు చేస్తున్న నిర్ణ‌యాల‌కు ఏమాత్రం సంబంధం లేకుండా వ్య‌వ‌హ‌రిస్తున్నార‌ని అంటున్నారు.

Advertisement
Bar Licenses Are Issued In Large Numbers In Jagan Government Details, CM Jagan,

మాట త‌ప్పం.మ‌డ‌మ తిప్పం అంటూనే చేయాల్సింద‌ని చేస్తున్నార‌నే టాక్ వినిపిస్తోంది.

దీనికి కారణం గ‌తంలో మద్యం నిషేధంపై జగన్ చేసిన వాగ్దానాలే. మ‌ద్యం నిషేధాన్ని ద‌శ‌ల వారీగా అమ‌లు చేస్తామ‌ని చెప్పిన జ‌గ‌న్ ఇప్పుడు ఏకంగా మరో నిర్ణ‌యం తీసుకుకున్నారు.

మాట త‌ప్ప‌న‌ని చెప్పే సీఎం జ‌గ‌న్ తాజాగా బార్ లైసెన్సుల వేలంతో మూడేళ్ల పాటు భారీ ఎత్తున ఆదాయానికి తెర తీసిన నేపథ్యంలో దశల వారీ మద్య నిషేధానికి మంగళం పాడినట్లేనని అంటున్నారు.నాడు విపక్ష నేత హోదాలో.

చంద్రబాబు మద్యాన్ని నిషేధిస్తారో లేదో నాకు తెలీదు.ఆయన ప్రభుత్వం దిగిపోతుంది.

న్యూస్ రౌండప్ టాప్ 20

రెండేళ్లకో.మూడేళ్లకో మన ప్రభుత్వం అధికారంలోకి వస్తుంది.

Advertisement

అప్పుడు మద్యాన్ని పూర్తిగా నిషేధిస్తాం.డబ్బులున్నవాడో.

సూటు బూటు వేసుకున్నవాడో ఫైవ్ స్టార్ హోటళ్లకు వెళ్లి తాగితే ఫర్లేదు.కానీ.

ఇంత విచ్చలవిడిగా ప్రజలతో మద్యం తాగిస్తారా.? దీని వల్ల పిల్లల చదువులూ దారి తప్పుతాయి.ఐదు ఫైవ్ స్టార్ హోటళ్లు మినహా మరెక్కడా మద్యం లభించకుండా చేస్తాం.

అని చెప్పారు.

ఎన్నిక‌ల మేనిఫెస్టోలో.

అక్కడితో ఆగని ఆయన 2019 ఎన్నికలకు ముందు వైసీపీ ఎన్నికల మేనిఫెస్టోలో. కాపురాల్లో మద్యం చిచ్చు పెడుతోంది.

మానవ సంబంధాలు ధ్వంసమైపోతున్నాయి.అందుకే మేం అధికారంలోకి వచ్చాక మూడు దశల్లో మద్యాన్ని నిషేధిస్తాం.

తర్వాత కేవలం ఫైవ్ స్టార్ హోటళ్లలోనే మద్యం దొరికేలా చేస్తాం అని పేర్కొన్నారు.ఇక 2019 ఎన్నికల్లో విజయం సాధించిన తర్వాత ఢిల్లీలో పెట్టిన తొలి ప్రెస్ మీట్ లో దశల వారీ మద్య నిషేదం గురించి అడిగిన ప్రశ్నకు సమాధానం ఇస్తూ.

మద్యంపై వచ్చే ఆదాయాన్ని ఒకేసారి పూర్తిగా తీసేయలేం.అందుకే దశల వారీ మద్యనిషేధాన్ని అమలు చేస్తాం.దానిపై వచ్చే ఆదాయాన్ని క్రమంగా తగ్గించుకుపోతాం.2024 ఎన్నికల నాటికి కేవలం ఫైవ్ స్టార్ హోటళ్లకే మద్యాన్ని పరిమితం చేస్తాం.తర్వాత ఓట్లు అడుగుతాం.

అని బాగానే చెప్పారు.అయితే అందుకు భిన్నంగా మూడేళ్ల పరిమిత కాలం అమలయ్యేలా బార్ లైసెన్సుల్ని వేలం వేయటం తెలిసిందే.

దశల వారీగా మద్య నిషేధాన్ని అమలు చేస్తానన్న జగన్ భారీగా బార్ లైసెన్సుల్ని ఎందుకు జారీ చేస్తున్నార‌నే ప్రశ్న ఉత్ప‌న్న‌మ‌వుతోంది.ఏకంగా 838 బార్లకు మూడేళ్ల కాల పరిమితితో బార్ లైసెన్సుల్ని ఎలా జారీ చేశార‌నే వాద‌న వినిపిస్తోంది.

తాజా వార్తలు