హైదరాబాద్ లో నిషేధిత బి.జి పత్తి విత్తనాలు సీజ్..!

హైదరాబాద్ లో( Hyderabad ) నిషేధిత బి.జి పత్తి విత్తనాలు( Banned BG Cotton Seeds ) పట్టుబడ్డాయి.

ఈ క్రమంలో విత్తనాలను అక్రమంగా తరలిస్తున్న ఐదుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు.కాగా సుమారు 12 వందల కిలోల నిషేధిత పత్తి విత్తనాలను పోలీసులు సీజ్ చేశారు.పట్టుబడిన పత్తి విత్తనాలు విలువ దాదాపు రూ.36 లక్షలు ఉంటుందని పోలీసులు అంచనా వేస్తున్నారు.అయితే కర్ణాటక నుంచి తెలంగాణలోని మంచిర్యాలకు( Mancherial ) తరలిస్తుండగా పోలీసులు పట్టుకున్నారని సమాచారం.

ఈ వ్యవహారంపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.ఈ క్రమంలోనే గత కొన్నేళ్లుగా గుట్టు చప్పుడు కాకుండా కొందరు దందాను కొనసాగిస్తున్నట్లు గుర్తించారు.

ఏపీకి అమరావతి రాజధాని మాత్రమే కాదు అంటూ చంద్రబాబు సంచలన పోస్ట్..!!
Advertisement

తాజా వార్తలు