ఐపీఎల్ 2020 లో మరో సూపర్ మ్యాచ్ ముగిసింది.దుబాయ్ వేదికగా చెన్నై సూపర్ కింగ్స్ తో జరిగిన మ్యాచ్ లో బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్ ఘన విజయం సాధించింది.
37 పరుగుల తేడాతో గెలిచింది.ధోనీ సేన.170 పరుగుల లక్ష్యాన్ని చేధించ లేక మరోసారి చేతులెత్తేసింది.20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి కేవలం 132 పరుగులు చేసింది.అంబటి రాయుడు 42, ఎన్ జగదీశన్ మినహా మిగతా బ్యాట్స్ మెన్ ఎవరూ పెద్దగా స్కోర్ చేయలేదు.
చెన్నై జట్టు ఆరంభం నుంచే వరుసగా వికెట్లు కోల్పోతూ .విజయం దిశగా వెళ్లలేకపోయింది.టాస్ గెలిచి మొదట బ్యాటింగ్‌కు దిగిన కొహ్లీ సేన 20 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 169 పరుగులు చేసింది.
కెప్టెన్ విరాట్ కొహ్లీ అద్భుతమైన బ్యాటింగ్ తో దుమ్మురేపాడు.కేవల 52 బంతుల్లో 90 పరుగులు (4 ఫోర్లు, 4 సిక్స్‌లు) చేశాడు.దేవదూత్ 33 పరుగులు (2 ఫోర్లు, 1 సిక్స్) చేసి పరవాలేదనిపించాడు.
శివం దుబే 22 (2 ఫోర్లు, ఒక సిక్స్) రన్స్ చేశాడు.ఓపెనర్ అరోన్ ఫించ్ కేవలం 2 పరుగులు చేసి మూడో ఓవర్‌లో ఔట్ అయ్యాడు.
ఆ తర్వాత 10వ ఓవర్లో దేవదూత్ పల్లికల్ కూడా పెవిలియన్‌కు వెళ్లిపోయాడు.అదే ఓవర్లో బిగ్ హిట్టర్ ఏబీ డివిలియర్స్ శార్దుల్ ఠాకూర్ బౌలింగ్‌లో ధోనీకి క్యాచ్ ఇచ్చి డకౌట్ అయ్యాడు.15వ ఓవర్లో వాషింగ్టన్ సుందర్ కూడా ధోనీకి క్యాచ్ ఇచ్చాడు.ఈ క్రమంలో కెప్టెన్ కొహ్లీ ఒంటరి పోరాటం చేస్తూ జట్టు స్కోర్‌ను పెంచాడు.
అతడికి శివం దుబే సహకారం అందించడంతో బెంగళూరు జట్టు 169 పరుగులు చేయగలిగింది.చెన్నై బౌలర్లలో శార్దుల్ ఠాకూర్ రెండు వికెట్లు పడగొట్టాడు.దీపక్ చాహర్, సామ్ కరన్ తలో వికెట్ తీశారు.
తాజా వార్తలు
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy