తెలుగు ప్రేక్షకులకు బండ్ల గణేష్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.ఆయన పవన్ కళ్యాణ్ కు వీరాభిమాని అని చెప్పుకుంటూ ఉంటాడు.
కొందరు మాత్రం ఆయన పవన్ పేరును వాడుకుంటూ ఉంటాడు అంటారు.అసలు విషయం ఏంటీ అనేది ఆయనకే తెలియాలి.
ఇక విషయానికి వస్తే భీమ్లా నాయక్ సినిమా ప్రీ రిలీజ్ వేడుక సందర్బంగా బండ్ల గణేష్ ను ఆహ్వానించక పోవడం చర్చనీయాంశం అయిన విషయం తెల్సిందే.ఆసమయంలో బండ్లను ఎందుకు ఆహ్వానించలేదు అనే విషయం లో రకరకాలుగా పుకార్లు షికార్లు చేశాయి.
ముఖ్యంగా బండ్ల గణేష్ కు త్రివిక్రమ్ కు పడటం లేదు.వైకాపా వారితో కలిసి త్రివిక్రమ్ నన్ను దూరం చేశాడు అంటూ కొన్ని ఆడియో క్లిప్ లు కూడా బయటకు వచ్చాయి.
దాంతో పవన్ కు కూడా బండ్ల గణేష్ దూరం అయ్యాడు.తనకు ఆప్త మిత్రుడు అయిన త్రివిక్రమ్ కు సన్నిహితుడు కానివాడు ఖచ్చితంగా నాకు ఎలా అవుతాడు అంటూ పవన్ కూడా దూరం పెట్టాడేమో అంటూ అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
ఈ సమయంలో బండ్ల గణేష్ గురించి రకరకాలుగా వార్తలు వస్తున్నాయి.అయినా వాటిని పట్టించుకోకుండా బండ్ల గణేష్ మాత్రం రోజు కూడా ట్విట్టర్ లో లేదా ఇంటర్వ్యూలో పవన్ ను ప్రస్థావిస్తూ.
ఆయన్ను ఆకాశానికి ఎత్తి మాట్లాడుతూ ఉన్నాడు.గతంలో కూడా పవన్ కు బండ్ల బాబు దూరం అయ్యాడు.
ఆ సమయంలో ఏదో మాటలు చెప్పి దగ్గర అయ్యాడు.ఇప్పడు మళ్లీ కూడా పవన్ టీమ్ లో చేరడం కోసం ఈ ట్వీట్స్ తో కాకా పడుతున్నాడు అంటూ కామెంట్స్ వస్తున్నాయి.
మరి ఈ సారి బండ్ల గణేష్ ను పవన్ క్షమించి గతంలో మాదిరిగా అక్కున చేర్చుకుంటాడా అనేది చూడాలి.పవన్ సీఎం అవ్వాలంటూ పదే పదే బండ్ల గణేష్ ట్వీట్స్ చేస్తూ కామెంట్స్ చేస్తున్నాడు.
తాజా వార్తలు
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy