నటుడిగా ఎన్నో సినిమాలు నటించి ఆ తర్వాత నిర్మాత గా పరిచయం అయిన బండ్ల గణేష్ పలువురు స్టార్ హీరోలతో సినిమా లను నిర్మించిన విషయం తెలిసిందే.
బండ్ల గణేష్ నిర్మాత గా ఎన్నో సినిమాలు వచ్చాయి.
అందులో కొన్ని కమర్షియల్ గా ప్లాప్ అవడం తో ఆర్థికంగా భారీగా నష్టపోయిన బండ్ల గణేష్ నిర్మాణానికి దూరంగా ఉంటున్నాడు.మళ్లీ నిర్మాణం లో అడుగు పెట్టేందుకు గత కొన్నాళ్లుగా ప్రయత్నాలు చేస్తున్నాడు అనిపిస్తోంది.
పవన్ కళ్యాణ్ డేట్లు ఇచ్చేశాడు, సినిమా మొదలు పెడతాను అంటూ కొన్నాళ్ల క్రితం బండ్ల గణేష్ ప్రకటించిన విషయం తెలిసిందే.కానీ పవన్ కళ్యాణ్ కాంపౌండ్ నుండి బండ్ల గణేష్ గెంటి వేయబడ్డాడు అనే పుకార్లు షికార్లు చేస్తున్నాయి.
అందుకు కారణం త్రివిక్రమ్ శ్రీనివాస్ అని కూడా ప్రచారం జరుగుతోంది.అందుకే ఒకానొక సందర్భంలో త్రివిక్రమ్ శ్రీనివాస్ పై బండ్ల గణేష్ తీవ్ర విమర్శలు చేశాడు.
పవన్ కళ్యాణ్ పై ఎప్పటికప్పుడు తన అభిమానాన్ని చాటుకుంటున్న కూడా మళ్లీ ఆయన్ని కలిసే అవకాశం రావడం లేదు.దాంతో పవన్ కళ్యాణ్ పై ఆశలు వదులుకొని రవితేజ తో సినిమా కు ప్రయత్నాలు చేస్తున్నట్లుగా అనిపిస్తుంది.ఆ మధ్య ధమాకా సినిమా సక్సెస్ మీట్ లో బండ్ల గణేష్ చేసిన వ్యాఖ్యలు వైరల్ అయిన విషయం తెలిసిందే.
ఆ తర్వాత కూడా పలు సందర్భాల్లో మాస్ రాజా రవితేజ ని బండ్ల గణేష్ ఆకాశానికి ఎత్తుతూ వ్యాఖ్యలు చేశాడు.తాజాగా మరో సారి ఒక చిరుత వీడియో ని షేర్ చేశాడు.రవితేజ అన్న ఉదయాన్నే ఇలా షూటింగ్ కి వెళ్తాడు అంటూ వేటకు వెళ్తున్న చిరుత వీడియో తో ఆకాశానికి ఎత్తేలా కామెంట్ చేశాడు.
మొత్తానికి రవితేజ డేట్స్ కోసం బండ్ల గణేష్ తీవ్రం గా ప్రయత్నాలు చేస్తున్నట్లుగా దీన్ని బట్టి అర్థమవుతుంది.మరి మాస్ రాజా ఈ బండ్లన్న యొక్క పొగడ్తలకు పడి పోయి డేట్లు ఇస్తాడా అనేది చూడాలి.
తాజా వార్తలు
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy