హమ్మయ్య ! బండ్ల గణేష్ కి కాంగ్రెస్ లో పదవి దక్కేసింది

తెలంగాణ ఎన్నికల్లో తాను పోటీ చేయబోతున్నా.అని చెప్పడమే కాదు .

ఏకంగా ఎమ్యెల్యే టికెట్ నాకే దక్కుతుందని ధీమా వ్యక్తం చేస్తూ మీడియా ముందు ముందస్తుగా ప్రమాణ స్వీకారం చేసేసిన సీనీ నిర్మాత , కమెడియన్ కమ్ పొలిటిషన్ అయిన బండ్ల గణేష్ కు ఎట్టకేలకు తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో పదవి దొరికేసింది.రాజేంద్రనగర్ టికెట్ పై గంపెడు ఆశలు పెట్టుకుని భంగపడ్డ సినీ నిర్మాత బండ్ల గణేష్‌ను.

పార్టీ పదవి ఇచ్చి బుజ్జగించింది.

తెలంగాణ పీసీసీ అధికార ప్రతినిధిగా ఆయనను నియమించింది.అంతకుముందు .రాజేంద్రనగర్ టికెట్ తనదే అంటూ బండ్ల గణేష్ పలు ఇంటర్వ్యూల్లో ధీమా వ్యక్తం చేశారు.అక్కడ కాకపోతే మరెక్కడిచ్చినా తాను విజయం సాధిస్తానని చెప్పారు.

Advertisement

కానీ కాంగ్రెస్ మాత్రం ఆయనకు ఎక్కడా సీటు ఇవ్వకుండా .అధికార ప్రతినిధి పదవి ఇచ్చి బుజ్జగించింది.

Advertisement

తాజా వార్తలు