లైఫ్ లో ఎవరినీ నమ్మొద్దు.. వైరల్ అవుతున్న బండ్ల గణేష్ సంచలన వ్యాఖ్యలు!

టాలీవుడ్ నటుడు బండ్ల గణేష్( Bandla Ganesh ) గురించి మనందరికి తెలిసిందే.బండ్ల గణేష్ తరచుగా ఏదో ఒక విషయంతో వార్తల్లో నిలుస్తూ ఉంటారు.

బండ్ల గణేష్ స్పీచులు, మాటలు, పంచ్‌లు కూడా బాగా వైరల్ అవుతూ ఉంటాయి.మైక్ దొరికితే పంచుల వర్షం కురుపిస్తు ఉండడంతో పాటు, సంచలన వాఖ్యలు చేస్తుంటారు.

ఇక సోషల్ మీడియాలో అప్పుడప్పుడు కౌంటర్లు వేస్తుంటాడు.ఆడియో కాల్ లీక్‌లతో కాంట్రవర్సీలోకి వస్తాడు.

ఇక కొన్ని సార్లు ట్విట్టర్లో తన బాధను, ఆవేదనను పంచుకుంటాడు.

Advertisement

ఈ క్రమంలో బండ్ల గణేష్ తాజాగా వరుసగా ట్వీట్లు వేశాడు.అందులో ఉన్న మ్యాటర్ గమనిస్తే బండ్ల గణేష్ ఎవరి వలనో బాధపడ్డాడని అనిపిస్తోంది.జీవితంలో ఎవరిని నమ్మొద్దు మిమ్మల్ని మీరు మాత్రమే నమ్ముకోండి.

ఎవరి దగ్గర నుంచైనా మనం సహాయం ఆశించామా, మనల్ని యాచకుల్లా చూస్తారు జాగ్రత్త అంటూ బండ్ల గణేష్ ట్వీట్లు( Bandla Ganesh Tweet ) వేశారు.దీంతో ఆయన్ను ఎవరైనా అవమానించారా?అని ఆరాలు తీస్తున్నారు.

అసలు బండ్లన్నకి ఏమైంది? అంటూ అంతా మాట్లాడుకుంటున్నారు.మళ్లీ ఏ ప్రొడ్యూసర్( Producer ) అయినా నో చెప్పాడా? ఇండస్ట్రీ జనాలు మోసం చేశారా? పొలిటికల్‌గా ఏమైనా జరిగిందా? అంటూ ఇలా మాట్లాడుకుంటున్నారు.అయితే ప్రస్తుతం ఇదే వార్త సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది.

మరి ఈ ప్రశ్నలపై ఏ విధంగా స్పందిస్తారో చూడాలి మరి.

రజనీకాంత్ తెలుగు సినిమాల్లో నటించకూడదని ఎందుకు నిర్ణయం తీసుకున్నాడు
Advertisement

తాజా వార్తలు